నిర్మాతలు ఎక్స్ పోజ్ చేయమని అడిగారు!

actress sangeetha about uyir movie
Highlights

టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి నటిగా చక్కటి గుర్తింపు సంపాదించుకుంది 

టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి నటిగా చక్కటి గుర్తింపు సంపాదించుకుంది సంగీత. హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించిన తనను ఓ సినిమా బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పుకొచ్చింది. తమిళ దర్శకుడు సామి రూపొందించిన 'ఉయిర్' అనే సినిమాలో సంగీత ఓ బోల్డ్ క్యారెక్టర్ లో నటించారు. కథ కొత్తగా అనిపించడం తన పాత్ర బోల్డ్ గా ఉండడంతో సంగీత ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు.

మరిది మీద ఆశ పడ్డ వదిన పాత్రలో సంగీతం కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు ఉండకూడదని అటువంటి సీన్స్ లో నటించనని సంగీత దర్శకనిర్మాతలకు ముందే చెప్పారట. తీరా షూటింగ్ సమయంలో నిర్మాతలు ఎక్స్ పోజ్ చేయమని అడిగారట. దానికి ఆమె అంగీకరించకపోవడంతో గొడవలు జరిగాయని అన్నారు. షూటింగ్ ఎలాగోలా పూర్తి చేసి సినిమా విడుదల చేశారు.

అసలు సినిమా చూడడం ఇష్టం లేకపోయినా థియేటర్ కు అమ్మతో కలిసి వెళ్లి చూసినట్లు, మధ్యలో వెళ్ళిపోవాలని అనుకున్న అమ్మ కారణంగా పూర్తి సినిమా చూసినట్లు సంగీతం అన్నారు. తనకు ఏ మాత్రం సినిమా నచ్చలేదని.. అటువంటి నెగెటివ్ క్యారెక్టర్ లో నన్ను నేను చూసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది. అయితే సినిమాకు హిట్ టాక్ రావడం తనను ఆశ్చర్యపరిచిందని స్పష్టం చేశారు. ఇదే సినిమాను 'మనోహరా' అనే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేశారు. 

loader