ఆ హీరో ఎవరినీ ప్రేమించొద్దని గట్టిగా అరిచాడు!

actress sangeetha about her friendship with vijay
Highlights

తెలుగులో 'ఖడ్గం','పెళ్ళాం ఊరెళితే' వంటి చిత్రాలతో కనిపించిన నటి సంగీత టాలీవుడ్ లో 

తెలుగులో 'ఖడ్గం','పెళ్ళాం ఊరెళితే' వంటి చిత్రాలతో కనిపించిన నటి సంగీత టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ ఆరంభంలో ఆమెను ఓ హీరో ప్రేమించొద్దని గట్టిగా అరిచినట్లు వెల్లడించారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. తమిళ స్టార్ హీరో ఇలయదలపతి విజయ్. విజయ్ తో చాలా కాలంగా స్నేహం ఉన్నట్లు ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

''విజయ్ తండ్రి మా తాతగారి నిర్మాణ సంస్థలో పని చేశారు. మేమంతా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్లం. విజయ్ సినిమాతోనే నేను హీరోయిన్ గా పరిచయం కావాల్సివుంది కానీ కుదరలేదు. తను నా డాన్స్ అంటే చాలా ఇష్టం. నేను స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వడం చూసి మెచ్చుకొని నాతో స్నేహంగా ఉండేవారు. నా మీద ఏమైనా రూమర్స్ వినిపిస్తే వెంటనే ఫోన్ చేసి నిజానిజాలు తెలుసుకునేవారు. అప్పట్లో ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండమని అరిచి మరీ చెప్పారు. కానీ నేను క్రిష్ ను ప్రేమించాను. అదే విషయాన్ని విజయ్ కు చెప్పి క్రిష్ ను పరిచయం చేశాను. క్రిష్ చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడని.. మా జంట బావుందని అభినందించారు'' అంటూ చెప్పుకొచ్చింది.  
 

loader