కన్నడలో కిరిక్ పార్టీతో హీరోయిన్ గా పరిచయమైంది సంయుక్త హెగ్డే. ఆ సినిమాతో తెలుగులో కూడా ఛాన్స్ కొట్టేసింది. కిరిక్ పార్టీ తెలుగు రీమేక్ కిరాక్ పార్టీలో హీరోయిన్ గా నటించి తెలుగు వారికి దగ్గరైంది. అయితే ఈ సినిమా తెలుగులో క్లిక్ అవ్వకపోవడంతో అమ్మడుకి ఆశించిన గుర్తింపు లభించలేదు. అయితే తన డాన్సులతో యూత్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న ఒక వీడియోను షేర్ చేసింది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ నాలుగు లక్షల వ్యూస్ ను సాధించింది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి!