రాజమౌళి సినిమాలో ఛాన్స్.. సమంత ఏమందంటే..!

Actress Samantha Is Not Offered For Rajamouli's Film
Highlights

'రాజమౌళి సినిమాకు నో చెప్పానని వార్తల్లో నిజం లేదు. ఆ సినిమా యూనిట్ ఎవరూ కూడా నన్ను సంప్రదించలేదు. అలాంటప్పుడు నేను నో ఎలా చెప్తారు' అంటూ సమంత వెల్లడించింది.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. రామ చరణ్, ఎన్టీఆర్ లు హీరోగా ఓ మల్టీస్టారర్ సినిమా రూపొందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నెల నుండి ప్రారంభం కానుంది. సినిమా మొదలుకాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా సెట్ వర్క్ ను మొదలుపెట్టారు రాజమౌళి. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ చాలా మంది తారల పేర్లు తెరపైకి వచ్చాయి.

కైరా అద్వానీ, కీర్తి సురేష్ ఇలా చాలా ఊహాగానాలు వినిపించాయి. తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. సమంతను ఈ సినిమా కోసం సంప్రదించగా ఆమె నో చెప్పిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ విషయం సమంత వరకు వెళ్లడంతో ఆమెకు  స్పందించక తప్పలేదు. 'రాజమౌళి సినిమాకు నో చెప్పానని వార్తల్లో నిజం లేదు. ఆ సినిమా యూనిట్ ఎవరూ కూడా నన్ను సంప్రదించలేదు. అలాంటప్పుడు నేను నో ఎలా చెప్తారు' అంటూ సమంత వెల్లడించింది.

మీడియాలో తనపై ఇలాంటి వార్తలు రావడం పట్ల అమ్మడు కాసేపు కస్సుబుస్సులాడింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 'రంగస్థలం','మహానటి','అభిమన్యుడు' వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం 'యూటర్న్' సినిమాలో నటిస్తోంది. తమిళంలో 'సీమరాజా','సూపర్ డీలక్స్' వంటి ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో పడింది. 

loader