కత్తి మహేష్ కొంత కాలంగా సెలెబ్రిటీలపైనా ముఖ్యంగా పవన్ కల్యాణ్ పైన విమర్శలు గుప్పిస్తున్నాడు. అయితే టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తాజాగా కత్తిమహేష్ కు బ్లాస్ట్ పంచ్ ఇచ్చింది. పూనమ్ కౌర్ తన ట్విటర్ లో వరుసగా కత్తి మహేష్ పై ట్వీట్స్ చేసి పంచ్ ఇచ్చింది. అంతేకాక కత్తి మహేష్ ను ఫ్యాట్సో(లావెక్కిన మనిషి) అని సంబోధిస్తూ  అవమానకరంగా ట్వీట్ చేసింది.

 

ఇతరులను విమర్శించి డబ్బులు సంపాదించుకుంటున్న కొందరి కంటే అడుక్కుతినే బెగ్గర్స్ బెటర్ అంటూ పూనమ్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. టీవీ ఛానెళ్లు ఈ టాపిక్ ను గానీ, లేక ఈ మనిషిని గానీ మార్చేయండి. ఈ ఫ్యాట్సోను రోజూ చూడలేక పోతున్నా.అంటూ ట్వీట్ చేసింది.

 

అంతేకాదు ఫ్యాట్సో అనటంలో తప్పేంలేదంటూ కూడా వివరించింది. లావుగా వున్నావని కమెంట్ చేస్తే అది పర్సనల్ విషయం అని నాకు చెప్పొద్దు. ఎందుకంటే టీవీల్లో చూసే మిలియన్ల జనాలు ఫ్యాట్సోను ఆదర్శంగా తీసుకునే అవకాశం వుంది. నేను జనం ఫిజికల్ గా, మెంటల్ గా ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటాన కాబట్టి ఇంతలా వర్రీ అవుతున్నానని ట్వీట్ చేసింది.

 

ఇక గతంలో రచయిత కోన వెంకట్ కూడా.. పవన్ కల్యాణ్ మౌనాన్ని కొందరు జోకర్లు అలుసుగా తీసుకుంటున్నారు. అది తప్పు. అన్నారు. 

 

అయితే కత్తి మహేష్ మాత్రం పవన్, త్రివిక్రమ్, బాలకృష్ణ, అల్లు అరవింద్ తదితరులపై తన కామెంట్లు పోస్ట్ చేయటం మాత్రం ఆపట్లేదు.