నేనెందుకు ఐటెం సాంగ్ చేయకూడదు.. నెటిజన్ కు ఘాటు రిప్లై!

actress kasturi shankar responds to troller
Highlights

ఒకప్పటి హీరోయిన్ కస్తూరి.. 'అన్నమయ్య','మా ఆయన బంగారం' వంటి చిత్రాలతో తెలుగు

ఒకప్పటి హీరోయిన్ కస్తూరి.. 'అన్నమయ్య','మా ఆయన బంగారం' వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యారు. అయితే కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకు దూరంగా ఉన్న ఆమె 'తమిళ పదం'చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు 'తమిళ పదం'కు సీక్వెల్ గా వస్తోన్న 'తమిళ పదం 2.0 సినిమాలో కూడా నటిస్తోంది.

ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ లో కనిపించనుంది. దీంతో సోషల్ మీడియాలో ఓ కొందరు నెటిజన్లు బాధ్యత గల అమ్మగా ఉండాల్సిన ఓ స్త్రీ ఇలా ఐటెం సాంగ్ లలో నటించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన కస్తూరి.. ఐటెం సాంగ్ అనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది. పెళ్లై, పిల్లలున్న మగాళ్లు కూడా ఐటెం సాంగ్స్ లో నటిస్తున్నారు కదా వారికి పిల్లల పట్ల బాధ్యత లేదా..? వారినెందుకు ఇలాంటి ప్రశ్నలు అడగరు. అమ్మనైతే ఐటెం సాంగ్ లో నటించకూడదా..? స్త్రీ పురుష సమానత్వం ఆమె పాయింట్ ఇప్పుడిప్పుడే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు.. ఇలాంటి ప్రశ్నలు వేసి సమానత్వాన్ని తొక్కేయకండి' అంటూ ఘాటు సమాధానమిచ్చింది. 

loader