సినీ నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. రీసెంట్ గా విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమాలో కూడా ఆమె మంచి పాత్ర పోషించారు. చాలా కాలంగా నటి హేమ ఆస్తికి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేవి.

ఆమెకు రూ.300 కోట్ల విలువైన ఆస్తి ఉందని, బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయని ఇలా రకరకాల వార్తలు వినిపించేవి. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది హేమ. తనకు మూడు వందల కోట్ల ఆస్తి ఉందని చాలా మంది అనుకుంటున్నారని, అసలు ఆ వార్తలు ఎలా వచ్చాయో అర్ధం కావడం లేదని చెప్పింది.

తన తల్లి కుటుంబం ధనవంతులు కావడంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒంటి నిండా బంగారంతో షూటింగ్ కి వెళ్లేదట. తమ కుటుంబానికి చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. పూరి జగన్నాథ్, కృష్ణవంశీ వంటి వారు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పుడు హేమ తన భర్తకు తెలియకుండా వారి డబ్బు అప్పుగా ఇచ్చేదట.

ప్రస్తుతం తను డబ్బు గురించి నటించడం లేదని, పేరు తీసుకొచ్చే పాత్రల కోసం మాత్రమే ఆలోచిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. మేల్ కమెడియన్స్ కి పారితోషికం బాగా ఇస్తున్నట్లు, లేడీ కమెడియన్స్ కి మాత్రం రెమ్యునరేషన్ విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు వెల్లడించింది. 

అవసరాల కోసం తప్పు చేసి రేప్ అంటే ఎలా..? శ్రీరెడ్డిపై హేమ కామెంట్స్!

నా నడుము పట్టుకొని గిల్లాడు.. నటి హేమ కామెంట్స్!

త్రివిక్రమ్ పేరు చెప్తే మండిపడుతున్న నటి హేమ!