బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది హరితేజ. అయితే బిగ్ బాస్ షో ఆమె కెరీర్ కు పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. ఆ షోలో పార్టిసిపేట్ చేసిన తరువాత అటు నటిగా, ఇటు వ్యాఖ్యాతగా బిజీ అయిపోయింది హరితేజ. సినిమాలో అవకాశాలు కూడా పెరగడంతో కెరీర్ పరంగా సక్సెస్ రేట్ తో దూసుపోతుంది. అయితే 'మహానటి' సినిమా చూడడం కోసం వెళ్ళిన హరితేజకు థియేటర్ లో ఘోర అవమానం జరగడంతో తన బాధను అందరికీ తెలియజెప్పాలని ఒక వీడియో రిలీజ్ చేసింది.

థియేటర్ కు తన తల్లితండ్రులు, సోదరితో కలిసి వెళ్లిన హరితేజ ఇంటర్వెల్ సమయంలో తన తల్లి పక్కన కూర్చోవాలనుకుంది. అప్పుడు హరితేజ తండ్రి ఓ అమ్మాయి పక్కన కూర్చోవాల్సి వస్తే, సదరు అమ్మాయి తల్లి ''మా అమ్మాయి మీ నాన్న పక్కన కూర్చోవడానికి కంఫర్టబుల్ గా లేదు.. మీరంటే సినిమా వాళ్ళు ఎవరి పక్కనైనా కూర్చుంటారు. మాకు ఆ కర్మ పట్టలేదంటూ'' దూషిస్తూ మాట్లాడడంతో హరితేజకు ఓ పక్క బాధ మరో పక్క కోపం. సినిమా వాళ్లంటే అందరిలానే సామాన్యులు. 'నేను ఇండస్ట్రీ మీద ఇష్టంతో వచ్చాను. అందరిలానే నా వృత్తిని నేను నిర్వహిస్తున్నాను. సినిమా వాళ్లంటే ఎవరి పక్కనైనా కుర్చుకుంటారు ఏమైనా చేస్తారనే అపోహతో అందరినీ నిందించడం కరెక్ట్ కాదు. మాకు కుంటుంబం ఉంటుంది. మా నాన్న సాధారణ ఉద్యోగి. సినిమా వాళ్ళంటేనే ఒక చిన్నచూపు. నేను ఇదంతా ఏదో మారాలని, క్రేజ్ కోసం చెప్పట్లేదు. ఈ విషయంతో నేను ఎంతో బాధకు గురయ్యాను. ప్రతి ఒక్కరికీ ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను' అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.