ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివెరీ సంస్థ జొమాటోలో డెలివెరీ బాయ్ గా పని చేసే ఓ వ్యక్తి తను డెలివరీ చేయాల్సిన ఫుడ్ పార్సెల్స్ లో కొంచెం తిని అనుమానం రాకుండా మళ్లీ ప్యాక్ చేసి అదే ఫుడ్ ప్యాకెట్ ను డెలివెరీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టడంతో ప్రముఖ నటి నమ్రత ఈ విషయంపై సీరియస్ అయింది.

జొమాటోని తిట్టడంతో పాటు తన పిల్లలను ఇక ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయనివ్వను, జనాలను కూడా ఆర్డర్ చేయొద్దని పిలుపినిచ్చింది. ఈ క్రమంలో మదురైలో ఈ సంఘటనకి 
పాల్పడ్డ డెలివెరీ బాయ్ ని జొమాటో ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు అతడిపై కేసు కూడా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో ఈ వ్యక్తిపై విమర్శలు వినిపిస్తుంటే హీరోయిన్ సంజన మాత్రం అతడిని సపోర్ట్ చేస్తోంది. ఆమె మాట్లాడుతూ.. ''ఆ డెలివెరీ బాయ్ ని అందరూ విమర్శిస్తున్నారు. అతడు పెద్ద దొంగతనం ఏం చేయలేదు కదా.. అతడి ఆకలి నేరమా..? అతడికి మరో ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది.

అతడు కేవలం ఫుడ్ ని మాత్రమే తిన్నాడు. ఆర్డర్ చేసిన వాళ్ల ఆస్తులను దొంగిలించలేదు. అందుకే జొమాటో అతడికి మరో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది'' అని వెల్లడించగా.. ఆమెకి కొందరు నెటిజన్ల నుండి మద్దతు లభించగా మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేస్తున్నారు. 
 

ఆ వీడియో చూసి ఫైర్ అయిన నమ్రత!