నటుడి షాపులో దొంగతనం.. పోలీసులకు ఫిర్యాదు!

actor utthej gave police complaint
Highlights

రచయిత, నటుడు ఉత్తేజ్ కు సంబంధించిన ఓ బట్టల షాపులో దొంగతనం 

రచయిత, నటుడు ఉత్తేజ్ కు సంబంధించిన ఓ బట్టల షాపులో దొంగతనం జరగడంతో పోలీసులను ఆశ్రయించారు. అమీర్ పేట్ లోని ఎల్లారెడ్డిగూడలో అలంకార్ డిజైనర్స్ పేరుతో ఉత్తేజ్ కు ఓ బట్టల షాపు ఉంది. దీన్ని ఆయన సతీమణి పద్మావతి నిర్వహిస్తున్నారు.

శనివారం ముగ్గురు మహిళలు కస్టమర్స్ లా వచ్చి షాప్ లో విలువైన చీరలను దొంగతనం చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పద్మావతి.. తన భర్తకు తెలియజేయడంతో సీసీ ఫుటేజ్ ను పరిశీలించి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.80 వేలు విలువైన చీరలు దొంగతనానికి గురైనట్లు తెలుస్తోంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 

loader