తమిళ నటుడితో తమన్నా పెళ్లి!

actor soundararaja married tamanna
Highlights

తమిళ నటుడు సౌందరరాజా.. తమన్నాను వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు

తమిళ నటుడు సౌందరరాజా.. తమన్నాను వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. గ్రీన్ ఆపిల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సీఈవో తమన్నాతో శుక్రవారం వివాహం జరిగింది. మదురైలో గుడిలో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. 'సుందరపాండియన్', 'జిగర్ తాండా' వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సౌందరరాజా ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు.  

loader