అడగకపోయినా చిరంజీవి నన్ను ఆదుకున్నారు, ఏడాది పాటు ఆ డబ్బుతో.. ఎవ్వరికీ తెలియన సీక్రెట్ బయటపెట్టిన శివాజీ
నటుడు శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత జోరు పెంచారు. బిగ్ బాస్ 7 శివాజీకి గతంలో ఉన్న గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ స్టోరీ సంచలన విజయం సాధించింది.
నటుడు శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత జోరు పెంచారు. బిగ్ బాస్ 7 శివాజీకి గతంలో ఉన్న గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ స్టోరీ సంచలన విజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్ లో శివాజీ తో పాటు తొలిప్రేమ చిత్రంలో పవన్ చెల్లిగా నటించిన వాసుకి నటించింది. ప్రస్తుతం శివాజీ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు.
శివాజీకి చిరంజీవి సాయం
శివాజీ తాజాగా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివాజీ చిరంజీవితో కలసి ఇంద్ర చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇంద్ర చిత్రంలో శివాజీ కథని మలుపు తిప్పే పాత్రలో నటించారు. ఇంటర్వెల్ సన్నివేశంలో శివాజీ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. తనకి చిరంజీవితో మంచి అనుబంధం ఉంది అని శివాజీ తెలిపారు.
ఆ సమయంలో నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి అని తెలిపారు. కనీసం రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేదు. ఆయా విషయం నేను చిరంజీవి గారికి చెప్పలేదు. కానీ ఆయనకి ఎవరి ద్వారానో తెలిసింది. దీనితో నన్ను పిలిచి సైలెంట్ గా 10 వేలు ఇచ్చారు. వద్దు సార్ అని చెప్పా.. పర్వాలేదు ఉంచు అని అన్నారు.
చిరంజీవికి నాకు మధ్య చిచ్చు పెట్టారు
ఆయన ఇచ్చిన 10 వేల రూపాలు నాకు ఏడాది మొత్తం ఉపయోగపడ్డాయి అని శివాజీ తెలిపారు. అప్పటి నుంచి నన్ను ఇంకా బాగా చూసుకునేవారు. చిరంజీవి గారు నాతో అంత క్లోజ్ గా ఉండడం కొంతమందికి నచ్చలేదు. దీనితో కావాలనే నాకు చిరంజీవి గారికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు అని శివాజీ తెలిపారు.
నా వల్ల నిజంగా తప్పు జరిగితే నేను ఓపెన్ అయిపోతా. అన్నయ్య నా వల్ల ఈ పొరపాటు జరిగింది అని చిరంజీవి గారికి చెప్పేవాడిని. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవ్వరికి వివరణ ఇవ్వలేదు అని శివాజీ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అలాంటి పరిస్థితే వచ్చింది అని శివాజీ తెలిపారు.
శివాజీ ఆస్తులు
శివాజీ తన ఆస్తుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖలు చేశారు. శివాజీ మాట్లాడుతూ తనకి ఆస్తుల కంటే క్యారెక్టర్ ముఖ్యమని అన్నారు. తానూ నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వ్యాపారాలు ఉండేవని శివాజీ అన్నారు. సినిమాల్లో రాణిస్తూనే వ్యాపారాలు చేశా. ఆ రోజుల్లో నేను చేసిన ఇన్వెస్టిమెంట్స్ ఈ రోజు నాచేతుల్లో ఉంది ఉంటే ఇండస్ట్రీలో నన్ను మించిన ధనవంతుడు ఉండేవాడు కాదు.
చాలా ప్రధాన నగరాల్లో ఎకరాల కొద్దీ భూములు ఉండేవి. అత్యంత విలువైన 14 ఎకరాలని సినిమా కోసం అమ్మేశా. ఆ ఆస్తులన్నీ ఉండిఉంటే తిరుగులేని ధనవంతుడిగా ఉండేవాడిని అని శివాజీ అన్నారు. నా ఊర్లో పొలం శాశ్వతంగా ఉంటే చాలు అనుకునే మెంటాలిటీ నాది. కాబట్టి మిగిలిన చోట్ల ఆస్తులు ఉంచుకోలేదు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శివాజీ
పదేళ్ల పాటు నాకు సినిమాలు లేకున్నా కానీ బతికానంటే అందుకు కారణం భూములపై చేసిన ఇన్వెస్టిమెంట్, రియల్ ఎస్టేట్ అని శివాజీ అన్నారు. సినిమా నన్ను బతికించింది. నా స్నేహితులు కూడా సినిమాలు చేస్తూ వ్యాపారాలు చేసి ఎదిగారని శివాజీ అన్నారు. నన్ను కాపాడింది సినిమా, వ్యాపారాలు మాత్రమే. ఏ రాజకీయ పార్టీ దగ్గర అయినా నేను చేయి చాచినట్లు నిరూపిస్తే ఈ క్షణం చనిపోతా అంటూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : అక్షయ్ తో హీరోయిన్ పెళ్లి.. మగాడు కాదు అనే అనుమానంతో కండిషన్
బిగ్ బాస్ హౌస్ లో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాను. అలాగే శివాజీ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళాను. కానీ ఈ రెండింటికీ మించి అక్కడ నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది అని శివాజీ అన్నారు.