దక్షిణాది రాష్ట్రాలు టార్గెట్ గా కేంద్రం ఆపరేషన్ గరుడ చేపట్టిందని... గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో జరుగుతున్నది ఆపరేషన్ ద్రవిడ కాదని.. అది ఆపరేషన్ గరుడ అని సినీనటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి నేత శివాజీ స్పష్టం చేశారు. ఇక దక్షిణాది రాష్ట్రాలపై ఆ పార్టీ రకరకాల పేర్లతో ఆఫరేషన్ లు నిర్వహిస్తోందన్నారు శివాజీ. కర్ణాటకపై కుమార అనే ఆపరేషన్ అయితే తమిళ నాడులో రావణ పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారట. ఇంతకీ శివాజీ చెప్పిన ఆపరేషన్ లక్ష్యాలేంటి. శివాజీ ఏం అంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పట్ల జరుగుతున్న కొన్ని భయంకరమైన విషయాలు ఏపీలోని ప్రతి ఒక్కరితో పంచుకోవాలని అనుకుంటున్న నేపథ్యంలో మీ ముందుకొస్తున్నానని శివాజీ ఓ విడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఏపీలోని ఏ

రాజకీయ పార్టీ భవిష్యత్తు గురించి నాకు బాధ లేదు. కానీ ఏపీలోని ప్రతి పౌరుడు ఎలాంటి నష్టం ఎదుర్కొంటున్నాడో చెప్పాల్సిన బాధ్యత తనపై వుందని శివాజీ వెల్లడించారు. ఏపీ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరుగుతుందోనని గత ఏడాదిగా నేను ఎంతతో మధనపడుతున్నానన్నారు శివాజీ. ఏపీలో అలజడి రేపేందుకు ఒక జాతీయ పార్టీ ఏపీపై దారుణమైన ఆపరేషన్ తయారుచేసింది. మీడియాలో వస్తున్నట్లు ఆ ఆపరేషన్ పేరు గరుడ కాదు. దాని పేరు ఆఫరేషన్ ద్రవిడ అన్నారు. అంటే దక్షిణ భారత దేశాన్ని జయించటం. ఈ క్రమంలో ఏపీకి , తెలంగాణకు ఒక పేరు. కర్ణాటకకు క పేరు. కేరళ, కర్ణాటక ఒకపేరు. ఇలా రాష్ట్రానికో పేరు పెట్టి ఆపరేషన్ నిర్వహిస్తున్నారని శివాజీ తెలిపారు. ఏపీ తెలంగాణకు సంబంధించి ఆపరేషన్ పేరు ద్రవిడ కాదని అది గరుడ అన్నారు. రాష్ట్రానికో పేరు అనుకుని ఏపీకి గరుడ అనిపెట్టారన్నారు. తమిళనాడు ఆపరేషన్ రావణ, కర్ణాటకు ఆపరేషన్ కుమార అంటే రాజ్ కుమార్ లేదా కుమార స్వామి అన్నారు. ఇక రెండు రాష్ట్రాల ద్రవిడులంటే రావణాసురుని వారసులు. ఇలా అతివాద వర్గం నుంచి వచ్చినవాళ్లు కాబట్టి... సంస్కృతిని పేరు చేయకుండా పేర్లు పెట్టుకుని కుట్ర చేస్తున్నారు.

 

ఈ తెలుగు బిడ్డని అతి దారుణంగా కబ్జా చేయటానికి కులాల కుంపట్లు, కోట్లు సంపాదించిన నేతల ద్వేషాలను క్యాష్ చేసుకోవటానికి మహత్తర పథకం రచించారు. శివాజీ నీకు ఎలా తెలుసు అని అడగొచచ్చు. నేను భారత దేశం పట్ల అవగాహనను దిల్లీలో నేర్చుకుని.. ఒక జాతీయ పార్టీ అనుబంధ సంస్థతో కలవటం, వాళ్లతో అనుబంధం, దిల్లీకి వెళ్లి ఘోరమైన నిజాలు తెలుసుకోవటం. నా ప్రాపకం కోసం అనుకున్నా... నేను తెలకపల్లి రవి గారికిచ్చిన ఇంటర్వ్టూలో చెప్పాను. ఏపీ పట్ల ఆ జాతీయ పార్టీ యొక్క లక్ష్యాన్ని చెప్పాను. ఈ మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో నేను ప్రజలకు చెప్పాలనే ఆలోచన వచ్చింది. నాకు కల్యాణ్ జీ అనే వ్యక్తి చెప్పిన దాని ప్రకారం వాళ్ల పాపం పండి అది నాదాక వచ్చింది. నాకు తెలిసిన వాళ్లకు చెప్తే నమ్మలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నేను చెప్పింది కరెక్ట్ అని నమ్ముతున్నాను.

ఆ ప్రధాన వ్యక్తి ద్వారా.. ఆ జాతీయ పార్టీ.. గురు అనే ఒక వ్యక్తి ద్వారా తమమ ఆపరేషన్ అమలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ పద్మ వ్యూహంలో అభిమన్యుడి లాంటి వాడే. జగన్ పైన కూడా కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ కుట్రలో దాడికి కూడా కుట్ర పన్నింది. ఆ దాడిని రాయలసీమ ప్రాంత వ్యక్తికి కానీ... ఏపీలో కుట్ర చేసేందుకు కానీ పనిచేస్తున్నారు. అలా ఏపీ సర్కారును డిసాల్వ్ చేసి... చంద్రబాబు మొదట సీఎం అయిన రోజునే... టార్గెట్ గా సర్కారును దెబ్బతీసేందుకు.. ఆ పార్టీ మీద దాడి చేసి.. అనేక రహస్యాలు బయటపెట్టి... కొత్త నేతను కేంద్ర మంత్రి పదవికి పంపాలని, వినకుంటే ఇంటికి(సినీ పరిశ్రమకు) పంపాలని.. అనంతరం మరో తెలుగు వాడికి అంటే ఆ పార్టీలో వున్న కీలక నేతకు సీఎం పదవి కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారు.

 

అదే ఆపరేషన్ గరుడ. ఆరు నెల్ల క్రితం మీరు నమ్మలేదు. పరిణామాలు చూస్తే... అదే జరుగుతోందనిపిస్తోంది. మంచి మనిషి అయిన ఆ కొత్త వ్యక్తి... నేను చెప్పేదంతా ట్రాష్ అనొచ్చు. కానీ వీళ్లు ముగ్గురికి పడకున్నా.. తెలుగు వాళ్లు కాబట్టి.. నేను ఈ విషయం బైట పెడుతున్నానంటూ శివాజీ సంచలన విషయాలు వెల్లడించాడు.