చెత్త ఎత్తుతున్న నటుడిని చూశారా?

actor nassar video goes viral
Highlights

సమాజానికి నీతులు చెప్పే స్థాయిలో ఉన్న వారు ఆ నీతులను ఎంతవరకు పాటిస్తారనేది సందేహమే

సమాజానికి నీతులు చెప్పే స్థాయిలో ఉన్న వారు ఆ నీతులను ఎంతవరకు పాటిస్తారనేది సందేహమే. కానీ సీనియర్ నటుడు నాజర్ మాత్రం నేను పాటించి తీరతాను అంటున్నాడు. రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆయన అక్కడ వారంతా కాఫీ, టీ తాగిన తరువాత ప్లాస్టిక్ గ్లాసులను ఎక్కడపడితే అక్కడ పడేశారు.

ఇది చూసి బాధపడ్డ ఆయన ఎవరికో చెప్పడం ఎందుకు నేనే శుభ్రం చేస్తా అంటూ ఓ ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ కప్పులన్నింటినీ.. ఎత్తి చెత్తకుండీలో పడేశారు. ఆయన చెత్త ఎత్తే సమయంలో అక్కడ పని చేసే సిబ్బంది వచ్చి మేం క్లీన్ చేస్తామని చెప్పినా.. ఆయన మాత్రం వాళ్లను పట్టించుకోకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని క్లీన్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియోపై పాజిటివ్ కామెంట్లతో పాటు నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని అవి వాతావరణానికి చేటని అధికారులు చెబుతుంటే ఇప్పుడు నాజర్ లాంటి నటుడు కూడా చెత్త శుభ్రం చేయడానికి అటువంటి ప్లాస్టిక్ కవర్లనే వినియోగించడంతో ఆయనను పొగుడుతూనే మరోపక్క తిడుతున్నారు. 
 

loader