ఆమె స్కర్ట్ పైకెత్తి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.. సీనియర్ నటుడి గుట్టురట్టు!

actor morgan freeman accused of sexual misconduct
Highlights

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు తమతో తప్పుగా

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు తమతో తప్పుగా ప్రవర్తిస్తూన్నారంటూ కొందరు నటీమణులు బహిరంగంగానే చెబుతున్నారు. హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వే వీన్ స్టీన్ తమను లైంగికంగా వేధించాడంటూ స్టార్ హీరోయిన్లు సైతం చెప్పుకొచ్చారు. తాజాగా మరో సీనియర్ నటుడు వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ప్రముఖ సీనియర్ నటుడు మోర్గన్ ఫ్రీమన్ కామ పిశాచి అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

80 ఏళ్ల వయసు గల ఇతడితో కలిసి పని చేసిన కొంతమని నటీమణులను ఇతడి తీరు గురించి వాకబు చేయగా వారందరూ కూడా అతడు తీరుని తప్పుబట్టారు. జూనియర్స్ ను లైంగికంగా ఇబ్బందులకు గురి చేస్తాడని చెప్పుకొచ్చారు. ఒకరిద్దరు మాత్రం అతడిని సపోర్ట్ చేసిన దాదాపు అందరూ కూడా ఆయన కామాంధుడని చెప్పినవారే. ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పని చేసే ఓ మహిళ పట్ల ఫ్రీమన్ దారుణంగా వ్యవహరించాడని తెలుస్తోంది.

ఆమె దగ్గరకు వెళ్లి సడెన్ గా స్కర్ట్ పైకెత్తి ఈరోజు నువ్వు ఇన్నర్ వేసుకున్నావో లేదోనని చూశా.. అంటూ అసభ్యకర కామెంట్స్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. సీనియర్ నటుడైన ఫ్రీమన్ ప్రవర్తన గురించి తెలుసుకున్న పలువురు షాకవుతున్నారు. ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉండకూడదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన ఫ్రీమన్ తన కారణంగా ఇబ్బంది పడిన మహిళలను క్షమాపణలు కోరుతున్నాడు.

''నా గురించి తెలిసిన వారికి, నాతో కలిసి పని చేసిన వ్యక్తులకు నేను కావాలని ఎవరినీ ఇబ్బంది పెట్టననే విషయం తెలుసు. ఆడవాళ్లను ఇబ్బందులకు గురి చేయాలనేది నా ఆలోచన కాదు. నా కారణంగా ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి'' అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.  

loader