సావిత్రి, ఎన్టీఆర్ ఇప్పుడు కాంతారావు!

actor kantha rao biopic on cards
Highlights

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లను సినిమాలుగా రూపొందించడానికి ఆశక్తి చూపుతున్నారు. 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లను సినిమాలుగా రూపొందించడానికి ఆశక్తి చూపుతున్నారు. ఇటీవల సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కించిన 'మహానటి' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే సంగతే.. ఇప్పుడు అదే క్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా రూపొందించనున్నారు. 

ఏఎన్నార్ బయోపిక్ కూడా సినిమా తీసే ఛాన్స్ ఉందని టాక్. అయితే తాజాగా మరో నటుడి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపొందబోతుంది. దర్శకుడు పీసి ఆదిత్య.. నటుడు కాంతారావు బయోపిక్ ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత ఆ రేంజ్ లో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు కాంతారావు. కానీ కొన్నేళ్లకు ఆర్ధిక కష్టాలు ఆయనను చుట్టుముట్టడంతో చితికిపోయారు.

కత్తి యుద్ధ వీరుడిగా పేరు గాంచిన కాంతారావు చివరి రోజుల్లో కూడా నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన జీవితంపై సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. దర్శకుడు ఆదిత్య.. కాంతారావు స్వగ్రామం గుదిబండకు వెళ్లి కొన్ని వివరాలను సేకరించారు. ఈ సినిమాకు 'అనగనగా ఓ రాజకుమారుడు' అనే పేరుని కూడా పెట్టినట్లు సమాచారం.   

loader