ఈ వారం నానితో పాటు.. మరో బిగ్ బాస్ హోస్ట్ కూడా సందడి చేయనున్నారు. ఆయనే యూనివర్సల్ స్టార్ కమలహాసన్. 

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ షో పై రానురాను ఆసక్తి పెరుగుతోంది. నాని తనదైన స్టైల్ లో హోస్టింగ్ చేస్తూ అదరగొడుతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో నాని హౌస్ మెట్స్ తో సందడి చేస్తుంటారు. కాగా ఈ వారం నానితో పాటు.. మరో బిగ్ బాస్ హోస్ట్ కూడా సందడి చేయనున్నారు. ఆయనే యూనివర్సల్ స్టార్ కమలహాసన్.

Scroll to load tweet…

క‌మ‌ల్ న‌టించిన విశ్వ‌రూపం 2 చిత్రం ఆగ‌స్ట్ 10న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా క‌మ‌ల్ .. నానితో పాటు హౌజ్ మేట్స్‌తో క‌లిసి సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. విశ్వ‌రూపం2 కి సంబంధించిన అనేక విష‌యాల‌ని హౌజ్ మేట్స్‌తో పాటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌తో పంచుకోనున్నాడ‌ని అంటున్నారు.

శ‌నివారం లేదా ఆదివారాల‌లో ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంద‌ని ఇన్‌సైడ్ టాక్. మరి యూనివ‌ర్స‌ల్ స్టార్‌తో మ‌న‌ నేచుర‌ల్ స్టార్ సంద‌డి ఎలా ఉంటుందో తెలియాలంటే మ‌రో రెండు రోజులు వేచి చూడ‌క తప్ప‌దు. కమల్.. తమిళ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.