హీరో, హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. హీరోయిన్ తల్లి ఫైర్!

actor huccha venkat gets married to aishwarya
Highlights

సినిమా హీరో, హీరోయిన్లు పెళ్లి అంటే ఆ హడావిడే వేరుగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో 

సినిమా హీరో, హీరోయిన్లు పెళ్లి అంటే ఆ హడావిడే వేరుగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో సీక్రెట్ మ్యారేజెస్ ఎక్కువయ్యాయ్. బాలీవుడ్ లో గత వారం సమయంలో రెండు పెళ్లిళ్ళు సీక్రెట్ గానే జరిగాయి. తాజాగా శాండల్ వుడ్ నటుడు హుచ్చ వెంకట్ నటి ఐశ్వర్యను వివాహం చేసుకొని వార్తల్లో నిలిచాడు. గత కొంతకాలంలో ఐశ్వర్యను ప్రేమిస్తోన్న వెంకట్ వారం క్రితం తలకావేరిలో ఈమెను వివాహం చేసుకున్నారు.

చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగింది. పసుపుకొమ్ము కట్టి, దండలు మార్చుకొని అతి నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా  ద్వారా అభిమానులతో పంచుకున్నారు హుచ్చ వెంకట్. ఇంట్లో పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో గుట్టుగా వివాహం చేసుకొని ఒక్కటయినట్లుగా తెలిపారు. అయితే ఈ వివాహంపై ఐశ్వర్య తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరిని అడిగి ఈ పెళ్లి చేసుకున్నారని, తను ఈ వివాహానికి అంగీకరించడం లేదని ఆమె అన్నారు. మూడు రోజులుగా ఐశ్వర్య ఫోన్ లో దొరకడం లేదని, వెంకట్-ఐశ్వర్య చెన్నైలోనే ఉన్నట్లు ఆమె అన్నారు. వెంకట్ పై పోలీస్ కంప్లైంట్ చేయాలంటే భయంగా ఉందని, తన నుండి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించడం సంచనలనంగా మారింది. 

loader