Asianet News TeluguAsianet News Telugu

Saana Kastam Song Promo: చిరు స్టెప్పులు, రెజీనా నడుము అందాలు.. థియేటర్లకు చానా కష్టం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం కోసం చాలా రోజులుగా అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సాలిడ్ కంటెంట్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. 

Acharya movie Saana Kastam Song Promo out now
Author
Hyderabad, First Published Jan 2, 2022, 12:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం కోసం చాలా రోజులుగా అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సాలిడ్ కంటెంట్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికి వరకు చిత్ర యూనిట్ నుంచి విడుదలవుతూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచుతూనే వచ్చాయి. 

ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కామియో రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్, రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. ఆ మధ్యన రాంచరణ్ సిద్ద పాత్రని పరిచయం చేస్తూ టీజర్ వదిలారు. టీజర్ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు చేసింది. తాజాగా ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ ప్రోమో బయటకు వచ్చింది. 

యంగ్ బ్యూటీ రెజీనా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో చూస్తుంటే ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మణిశర్మ మంచి బీట్ తో సాంగ్ ని కంపోజ్ చేశారు. చానా కష్టం అంటూ సాగే లిరిక్ క్యాచీగా ఉంది. 

 

ఇక ఈ పాటలో మెగాస్టార్ స్టెప్పులు, రెజీనా అందాల మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ లా కనిపిస్తున్నాయి. ఈ సాంగ్ థియేటర్స్ లో మోతెక్కిపోవడం ఖాయం. చిరంజీవి తనదైన శైలిలో అమేజింగ్ డాన్స్ మూవ్స్ తో అదరగొడుతున్నారు. ఇక రెజీనా నడుము తిప్పుతూ కుర్రలని ఊరిస్తోంది. ఫుల్ సాంగ్ జనవరి 3న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నారు.  

Also Read: ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తితో పవన్ హీరోయిన్ మ్యారేజ్.. పబ్లిక్ గా ప్రపోజల్, కాంగ్రెస్ నేత తనయుడే

Follow Us:
Download App:
  • android
  • ios