- Home
- Entertainment
- ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తితో పవన్ హీరోయిన్ మ్యారేజ్.. పబ్లిక్ గా ప్రపోజల్, కాంగ్రెస్ నేత తనయుడే
ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తితో పవన్ హీరోయిన్ మ్యారేజ్.. పబ్లిక్ గా ప్రపోజల్, కాంగ్రెస్ నేత తనయుడే
బోల్డ్ బ్యూట్య్ అమీషా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో అమీషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో అమీషా పటేల్ కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది.

బోల్డ్ బ్యూట్య్ అమీషా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో అమీషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో అమీషా పటేల్ కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి కూడా.
కానీ అమీషా పటేల్ టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. బాలీవుడ్ లో కూడా ఆమెకు అంతాగా కలసి రాలేదు. స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులర్ కాలేకపోయినప్పటికీ అవకాశాలు దక్కించుకుంది. ఇక అమీషా పటేల్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.తన బోల్డ్ ఫోజులతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తూ అందాలతో కనువిందు చేసింది.
ప్రస్తుతం అమీషా పటేల్ వయసు 45 ఏళ్ళు. అయినప్పటికీ ఇంతవరకు అమీషా జీవితంలో ప్రేమ పెళ్లి ఊసే లేదు. అమీషా కూడా తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ తాజాగా ఆమె ప్రేమ వ్యవహారం బయట పడింది. త్వరలోనే అమీషా పెళ్లి పెట్టలేక్కబోతున్నట్లు స్పష్టం అవుతోంది.
దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ తో అమీషా ప్రేమలో ఉంది. డిసెంబర్ 30న ఫైజల్ జన్మదిన వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా అమీషా పటేల్ ఫైజల్ పటేల్ కు ట్విట్టర్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. 'హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు.. అని పోస్ట్ పెట్టింది.
దీనికి పైజల్ ఆసక్తికరంగా బదులిచ్చాడు. 'థాంక్యూ అమీషా.. నేను ఈ సందర్భంగా పబ్లిక్ గా ప్రపోజ్ చేస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకుంటావా ?' అని రిప్లై ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఫైజల్ తన ట్వీట్ ని డిలీట్ చేశాడు. ఈ లోపే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయింది. అమీషా, ఫైజల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు స్పష్టం అయిపోయింది అని నెటిజన్లు అంటున్నారు.
గతంలో కూడా వీరిద్దరూ కొన్ని పార్టీలో కనిపించారు. అయితే అప్పట్లో వీరిద్దరి గురించి ఎలాంటి రూమర్స్ వినిపించలేదు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఫైజల్ అమీషా కన్నా వయసులో నాలుగేళ్లు చిన్నవాడు. అతడికిఆల్రెడీ మ్యారేజ్ అయింది. 2016లో ఫైజల్ భార్య జైనాబ్ పటేల్ కార్డియాక్ సమస్యలతో మరణించారు. కొంతకాలం సింగిల్ గా ఉన్న ఫైజల్ ఆతర్వాత అమీషా ప్రేమలో పడ్డాడు.
ఏది ఏమైనా కొత్త సంవత్సరంలో అమీషా పటేల్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అమీషా తెలుగులో బద్రి, నాని, పరమ వీర చక్ర లాంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ గా తన అందాల ఘాటు కొనసాగిస్తోంది. Also Read: Radhe Shyam: జాతకాలపై ప్రభాస్ అభిప్రాయం ఏంటి.. మనకు అర్థం కాకపోతే అబద్ధమేనా ?