ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ బయోపిక్ ను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దీనికి 'యాత్ర' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. అయితే ఈ సినిమాలో వైఎస్ కూతురు షర్మిల పాత్రలో నటి భూమిక కనిపించనుందనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇందులో నిజం లేదని సమాచారం. 

నిజానికి భూమికను ఓ ఫిక్షనల్ క్యారెక్టర్ కోసం సంప్రదించిందట చిత్రబృందం. దానికి ఆమె ఇంకా అంగీకారం కూడా తెలపలేదట. ఇంతలో ఆమె షర్మిల పాత్రలో కనిపించబోతుందంటూ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అసలు కథ ప్రకారం సినిమాలో షర్మిల క్యారెక్టర్ కనిపించందని అంటున్నారు. షర్మిలకు గానీ, భారతి గానీ అసలు సినిమాలో కనిపించరంటోంది చిత్రబృందం.

ఈ సినిమా మొత్తం వైఎస్ పాదయాత్ర చుట్టూ తిరుగుతుందని.. కేవలం రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ స్క్రిప్ట్ సిద్ధం  చేసుకున్నారని టాక్. గాంధీభవన్, పార్టీ మీటింగ్స్ తదితర అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ఫ్యామిలీను పెద్దగా టచ్ కూడా చేయడం లేదని తెలుస్తోంది.