Asianet News TeluguAsianet News Telugu

టాప్ ఓటీటి సంస్థకు “మహా సముద్రం” రైట్స్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే

‘మహా సముద్రం’ ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేనిది. ఇది భావోద్వేగాల ప్రేమకథ. విభిన్న పాత్రలుంటాయి. యాక్షన్‌ అదే స్థాయిలో ఉంటుంది. సినిమాలో అన్నిరకాల భావోద్వేగాలుంటాయి. ఇద్దరి హీరోలతో సినిమా ఎలా చేస్తావో అని చాలా మంది సందేహపడ్డారు. అఖరికీ ఆర్జీవీ కూడా శర్వానంద్‌, సిద్దార్థ్‌లను ఎలా హాండిల్‌ చేస్తావో చూస్తానన్నారు. 

About Maha Samudram movie ott rights deal
Author
Hyderabad, First Published Oct 13, 2021, 10:28 AM IST

శర్వానంద్‌ (Sharwananad), సిద్ధార్థ్‌ (Siddharth) ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ ( Mahasamudram) దసరా కానుకగా  ఈనెల 14న  విడుదల కానుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం తర్వాత అజయ్‌ భూపతి (Ajay Bhupathi) తెరకెక్కిస్తోన్న చిత్రమిది కావటంతో సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్. జగపతిబాబు, రావురమేశ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓటీటి స్ట్రీమింగ్ హక్కులపై అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ రైట్స్ ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రోజుల కి ఈ చిత్రం అందులో అందుబాటులోకి వస్తుందో అన్నది తెలియాల్సి ఉంది.  అయితే సినిమా హిట్టైతే 50 రోజుల తర్వాతే ఓటీటిలో వస్తుంది. లేదా నెలలోనే వచ్చేస్తుంది. 

Also read: 'మహా సముద్రం' ట్రైలర్ 'RX 10000'లా ఉంది.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే.. వర్మ హాట్ కామెంట్స్

దర్శకుడు అజయ్‌ భూపతి మాట్లాడుతూ..‘ ‘మహా సముద్రం’ ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేనిది. ఇది భావోద్వేగాల ప్రేమకథ. విభిన్న పాత్రలుంటాయి. యాక్షన్‌ అదే స్థాయిలో ఉంటుంది. సినిమాలో అన్నిరకాల భావోద్వేగాలుంటాయి. ఇద్దరి హీరోలతో సినిమా ఎలా చేస్తావో అని చాలా మంది సందేహపడ్డారు. అఖరికీ ఆర్జీవీ కూడా శర్వానంద్‌, సిద్దార్థ్‌లను ఎలా హాండిల్‌ చేస్తావో చూస్తానన్నారు. నిజానికి హీరోలిద్దరూ అన్నిరకాలుగా సహకరించారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ అదిరిపోద్ది. ఈ సినిమా కథ భిన్నమైంది. నా మీద నమ్మకముంచిన నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసి భావోద్వేగాలు నిండిన కళ్లతో బయటకొస్తారు’ అని అన్నారు.  

సిద్దార్థ్‌ మాట్లాడుతూ...‘ తెలుగు ప్రేక్షకులకు నాకు గ్యాప్‌ వచ్చిందని చాలా మంది అంటున్నారు. నన్ను స్టార్‌ని చేసింది తెలుగు ప్రేక్షకులే. నేను ఎక్కడికి వెళ్లట్లేదు. నేను మీ సిద్ధుని. జెమిని కిరణ్‌ వల్లే నేను ఈ సినిమాలో భాగమయ్యాను. సినిమా ట్రైలర్‌ చూసి ఇతర పరిశ్రమల నుంచి ఫోన్లొచ్చాయి. ప్రతి ఒక్కరికి పేరుపేరున అందరికీ థాంక్స్‌. సినిమాలో పనిచేసిన అందరికీ ‘మహాసముద్రం’ మైలురాయిగా మిగిలిపోతుందనే నమ్మకముంది. మహాసముద్రం నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో తెలియదు. 

Also Read: 'మహా సముద్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అను ఇమ్మాన్యుయేల్, అదితి గ్లామర్ మెరుపులు

కానీ, నాకు ‘మహాసముద్రం’ ద్వారా శర్వానంద్‌ దొరికాడు. ఇది ఎవరి సినిమా అని అడుగుతున్నారు. ఇది కచ్చితంగా శర్వానంద్‌ సినిమానే. ఇది నా కమ్‌బ్యాక్‌ సినిమా కాదు. రీలాంఛ్ లాంటిది. నా ఇండస్ట్రీకి మళ్లీ నన్ను తీసుకొచ్చినందుకు అజయ్‌ భూపతికి కృతజ్ఞతలు’ అన్నారు. శర్వానంద్‌ మాట్లాడుతూ..‘ ఇది నా ఒక్కడి ‘మహాసముద్రం’ అంటే ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. తెలుగు సినిమా అని గర్వపడే సినిమా అవుద్ది. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు అజయ్‌ భూపతికి ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ మనం సినిమాలు చేయాలి’ అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios