‘‘ఏదీ చేతకాదు.. కానీ అందమైన పెళ్లాం దొరికింది’’

Abhishek Bachchan says ‘get well soon’ to a troll calling him ‘useless’
Highlights

అభిషేక్ బచ్చన్ పై నెటిజన్ ఘాటు విమర్శ.. తిప్పికొట్టిన చోటా బచ్చన్

హీరో, హీరోయిన్లను నెటిజన్లు విమర్శించడం కొత్త విషయం ఏమీ కాదు. సినీ తారల డ్రస్సులు, పబ్లిక్ లో వాళ్ల బిహేవియర్.. ఇలా ప్రతి ఒక్కదానిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా.. అభిషేక్ బచ్చన్ కి ఒక నెటిజన్ నుంచి చేదు అనుభవం ఎదురైంది.  అభిషేక్ ని కించపరుస్తూ.. ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చూసిన చోటా బచ్చన్.. అంతే ఘాటుగా ఆ నెటిజన్ కి రిప్లై ఇచ్చాడు.

 ‘క్రికెటర్‌ స్టూవర్ట్‌ బిన్నీ, బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్ ఒకే రకం. అర్హులు కాకపోయినప్పటికీ వీరిద్దరికీ అందమైన భార్యలు దొరికారు. తమ తండ్రుల పాపులారిటీని వాడుకుని ఒకరు సినిమాల్లో, మరొకరు క్రికెట్‌లోకి వచ్చారు. ఇద్దరూ పనికిరానివాళ్లే. ఇది నిజమని అనిపిస్తే మీరూ రీట్వీట్ చేయండి’ అని ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌ కాస్తా అభి కంట పడింది. దాంతో నెటిజన్‌ సిగ్గుతో తలదించుకునేలా దీటుగా సమాధానమిచ్చారు. ‘నా స్థానంలో నువ్వుండి ఒక మైలు ప్రయాణించి చూడు. నువ్వు పది అడుగులు నడవగలిగినా నేను సంతోషిస్తాను. నీ ట్వీట్‌ను బట్టి చూస్తే నువ్వు నాలా ప్రయాణించలేవని అర్థమవుతోంది. కాబట్టి నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించు. ఇతరుల గురించి చింతించకు. ఎవరి ప్రయాణం వారిది అన్న విషయం దేవుడికి తెలుసు’ అని పేర్కొన్నారు.

ఇందుకు ఆ నెటిజన్‌ స్పందిస్తూ..‘అభి..నేనేదో సరదాగా అలా అన్నాను. థియేటర్లో నీ సినిమాలు బాగా ఆడకపోయినా నీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ అంటే నాకు ఇష్టం. ఏదో జోక్‌ చేశాను. ఇందుకు నువ్వు బాధపడి ఉంటే క్షమించు. బచ్చన్‌ కుమారుడివైన నీపై, సచిన్‌ తెందుల్కర్‌ కుమారుడు అర్జున్‌పై ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. క్షమించు’ అని వేడుకున్నాడు.

loader