ఐశ్వర్యరాయ్ తో గొడవ.. అభిషేక్ ఏమన్నాడంటే..!

First Published 24, Jul 2018, 10:53 AM IST
Abhishek Bachchan On Fight With Wife Aishwarya
Highlights

లాంటి విషయాలపై తప్పదు వార్తలు రాయడం తగదు. కొంచెమైనా బాధ్యతగా వ్యవహరించాలి. మీ అవసరాన్ని నేను అర్ధం చేసుకున్నాను.. కానీ బాధ్యతాయుతమైన పని చేసి ఉంటే అభినందించేవాడిని

బాలీవుడ్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ ల మధ్య బంధం సరిగ్గా లేదని వారు గొడవ పడుతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వీటిని ఖండిస్తూ వస్తోన్న బచ్చన్ ఫ్యామిలీ ఈసారి ఈ విషయంపై కాస్త సీరియస్ అయింది. ఇటీవల అభిషేక్ బచ్చన్ తన భార్య, కూతురితో కలిసి లండన్ టూర్ కు వెళ్లారు. టూర్ ముగించుకొని ముంబై చేరుకున్న వీరి ఫోటోలు ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫొటోల్లో ఆరాధ్య తన తండ్రికి దూరంగా ఉంది. అంతేకాదు ఐశ్వర్యను గట్టిగా పట్టుకొని నడుస్తోంది. ఆమె కూడా కూతురిని జాగ్రత్తగా పట్టుకుంది. దీంతో ఐశ్వర్య.. ఆరాధ్యను అభిషేక్ దగ్గరకు పంపలేదని వీరి మధ్య గొడవలు జరిగాయంటూ ఓ వెబ్ సైట్ వార్తను ప్రచురించింది. ఈ విషయంపై అసహనానికి లోనైన అభిషేక్ తనదైన శైలిలో స్పందించాడు. 'ఇలాంటి విషయాలపై తప్పదు వార్తలు రాయడం తగదు.

కొంచెమైనా బాధ్యతగా వ్యవహరించాలి. మీ అవసరాన్ని నేను అర్ధం చేసుకున్నాను.. కానీ బాధ్యతాయుతమైన పని చేసి ఉంటే అభినందించేవాడిని' అంటూ ట్వీట్ చేశారు. గతంలో కూడా ఓ మహిళ అభిషేక్ కూతురిని విమర్శిస్తూ.. ఆరాధ్య పాఠశాలకు వెళ్లడం లేదు.. పార్టీల్లోనే ఎక్కువగా కనిపిస్తూ అంటూ రాసుకొచ్చింది. వీకెండ్ లో కూడా పాఠశాల ఉంటే పంపించేవారమని అభిషేక్ సదరు మహిళకు ఘాటు సమాధానమిచ్చారు. 

loader