Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 13వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో వేద పెళ్లికసలు ప్రేమ ముఖ్యం కాదు విన్నీ, చిన్న సంతోషం చిన్న సంతృప్తి చిన్న భరోసా ఇవన్నీ కలిపి ఒక పెళ్లిని సక్సెస్ వైపు నడిపిస్తాయి అంటుంది వేద. అంటే నేను అన్ లక్కీ పర్సన్ అంటావా అనడంతో ఏమంటున్నావ్ విన్నీ అనగా కాలేజీలో ఉన్నప్పుడు చాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు అని అంటాడు విన్నీ. అప్పుడు వేద విన్నీ నీకు అసలు ఆ ఛాన్స్ లేదు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి అని అంటుంది. నీకు ఒక ప్రాంక్ చెప్పనా అసలు నీకు టేస్ట్ లేదు ఇప్పుడున్న మీ ఆయన కూడా కొంచెం క్రాక్ కదా అని అనగా అప్పుడు వేద హలో మైండ్ యువర్ లాంగ్వేజ్ నా ముందే మా ఆయనను తిడతావా అని అంటుంది.
అప్పుడు విన్నీ నేను ఎన్ని చెప్తున్నా కూడా మీ ఇద్దరి మధ్య ప్రేమ విషయం మాత్రం మాట్లాడటం లేదు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత మాళవిక అయితే ఇప్పుడే వెళ్దాం పద అభిమన్యు దగ్గరికి ఏది నిజమో ఏది అబద్దమో ఇప్పుడే తెలిసిపోతుంది అనడంతో సరే అని అక్కడికి పిలుచుకొని వెళ్తాడు. విన్నీ వెళ్లిపోవడంతో వేద క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మాళవిక యష్ వస్తాడు. అప్పుడు యష్ ఏం చేస్తున్నావ్ వేద ఇక్కడ అని అడగగా కాఫీ తాగడానికి వచ్చాను అంటుంది. మాళవిక యష్,వేదని తప్పుగా అపార్థం చేసుకొని మీరిద్దరూ ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చారు నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు అని అనుకుంటుంది.
అయితే మీరు చెప్పేది నిజమైతే ముగ్గురం అభిమన్యు దగ్గరికి వెళ్ళాము పదండి అంటుంది మాళవిక. తర్వాత ముగ్గురు కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత అభి ఒక అమ్మాయిని ఇంటికి పిలుచుకొని వచ్చి ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ హగ్గులు ఇస్తూ ఆ అమ్మాయిని పొగుడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మాళవిక వస్తుంది. అప్పుడు మాళవిక అభి అమ్మాయిని కలిసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అభి కాలర్ పట్టుకొని నన్ను చీట్ చేస్తావా అసలు ఎవతిది? ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది అని కోపంతో మాట్లాడుతుంది మాళవిక.
అరేళ్లుగా నీ ప్రేమ కోసం తపిస్తూ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అలాంటి నన్ను మోసం చేస్తావా అని అంటుంది. బంగారం కూల్ నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అనడంతో సెటప్ అభి అని అంటుంది. అప్పుడు అభి తప్పించుకోడానికి అబద్ధాలు ఆడుతూ ఉండగా షటాప్ అభి మాట్లాడకు అని అంటుంది. నీకోసం నేను నా భర్తను వదిలేసాను పిల్లల్ని కూడా వదులుకున్నాను అని అంటుంది మాళవిక. ఆ మాటలు విన్న వేద, యష్ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు మాళవిక ఏడుస్తూ నన్ను నువ్వు కేవలం వాడుకుంటూ వచ్చావు మోసం చేశావు అని అంటుంది.
ఇంతలోనే అక్కడికి భ్రమరాంబిక వస్తుంది. అప్పుడు మాళవిక ది గ్రేట్ భ్రమరాంబిక గారు కూడా ఇక్కడే ఉన్నారా చూశారా మీ తమ్ముడు ఎలాంటి పని చేస్తున్నారో నిలదీయండి అని అంటుంది. అప్పుడు భ్రమరాంబిక ప్లేట్ ఫిరాయిస్తూ ఆ అమ్మాయి ఎవరో మాళవికకు చెప్పావా అని అంటుంది. లేదు అక్క అని అంటాడు. ఇప్పుడు అందరి కలిసి మాళవికని పిచ్చిదాన్ని చేస్తూ ఆ అమ్మాయి ఎవరో కాదు వెడ్డింగ్ ప్లానర్ అని అబద్ధాలు వాడుతారు. నేనే అమ్మాయిని పిలిపించాను ఈ డెకరేషన్ అంతా మీ ఫస్ట్ నైట్ కోసమే అని భ్రమరాంబిక కూడా నాటకాలు ఆడుతుంది. అప్పుడు యష్, వేద ఎదురు టెన్షన్ పడుతూ ఉంటారు.
అప్పుడు అభి, మాళవిక మీద దొంగ ప్రేమలు కురిపిస్తూ నువ్వంటే నా ప్రాణం అని అంటాడు. ఇప్పుడు అభి మాయమాటలు నిజమని నమ్మిన మాళవిక స్వారీ అని అంటుంది. అప్పుడు మాళవిక అంతా ఈ యశోదర్ వల్లే అని యష్ ని నిలదీస్తుంది. అప్పుడు మాళవిక వేద గురించి మాట్లాడడంతో నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడాలంటే జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు యష్. అప్పుడు యష్ మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించగా మాళవిక యష్ ని అపార్థం చేసుకుంటుంది. తర్వాత ఇంటికి వెళ్లి యష్, కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
నీకు మాళవిక ఏమైతే నీకెందుకు అభి ఏమైతే నీకెందుకు నీ పని నువ్వు చేసుకో ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం మనకు లేదు అని వేద మీద సీరియస్ అవుతాడు యష్. నేను చూసింది చెప్పాను అంతే అనగా మనకు అవసరం లేదు ఇప్పటినుంచి చాలు అని అంటాడు. ఆ మాళవికతో నీకు అనవసరం మర్చిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
