నారా రోహిత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు పరుచూరి మురళి తెరకెక్కించిన చిత్రం 'ఆటగాళ్లు'.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో నారా రోహిత్ డైరెక్టర్ గా కనిపించగా, జగపతిబాబు క్రిమినల్ లాయర్ గా దర్శనమిచ్చాడు.

ఓ మర్డర్ మిస్టరీ నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది. తను ప్రేమించిన అమ్మాయిని హత్య చేశాడనే ఆరోపణలతో రోహిత్ ను అరెస్ట్ చేయగా, అతడిని దోషిగా నిరూపించడానికి జగపతిబాబు వేసే ఎత్తుగడలతో సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సాయి కార్తిక్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.