"బాహుబలి" కి బాబులా ఉండాల.. అదీ టార్గెట్

aamir khan targets bahubali to be number one in india
Highlights

  • దేశంలో 1000 కోట్లు పైగా వసూలు సాధించి బెంచ్ మార్క్ సినిమాగా నిలిచిన బాహుబలి
  • బాహుబలికి ముందు రూ.745 కోట్లతో టాప్ పొజిషన్ లో నిలిచిన పీకే
  • బాహుబలి కలెక్షన్స్ మించి వసూలు చేసేలా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ను తీర్చిదిద్దుతున్న టీమ్

'ధూమ్‌ 3' దర్శకుడు విక్టర్ ఆచార్య తలపెట్టిన 'థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌' చిత్రం జూన్ ఫస్ట్ నుంచి షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. కానీ బాహుబలి దెబ్బకు దాన్ని ఆలస్యంగా లాంఛ్‌ చేయబోతున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్‌ ఓకే అయిపోయిన ఈ చిత్రానికి మరోసారి స్క్రిప్ట్‌ పై పనిచేస్తున్నారు. బాహుబలి చిత్రం సాధించిన కలెక్షన్లు చూసి ఈ చిత్రం స్థాయి ఇంకా ఎక్కువ ఉండేలా తెరకెక్కించాలని ప్లాన్ వేస్తున్నారు. అందుకు అనుగుణంగా పకడ్బందీ పాత్రలు, కథ, కథనాలు సిద్ధం చేసుకుని, హాలీవుడ్‌కి తీసిపోని విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారు. బాహుబలి వెయ్యి కోట్లకి పైగా గ్రాస్‌ వసూలు చేసిన నేపథ్యంలో యష్‌రాజ్‌ సంస్థ ఈ రివిజన్‌కి ఆదేశించిందని ప్రముఖ వార్తా సంస్థ బాలీవుడ్ హంగామా ప్రచురించింది.

 

అయిదు వందల కోట్ల బడ్జెట్‌ అయినప్పటికీ కాంప్రమైజ్‌ కారాదని, భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో దీనిని రూపొందించాలని డిసైడ్‌ అయింది. ఈ చిత్రంలో వార్‌ ఎపిసోడ్స్‌ చాలానే వుంటాయని, 'పైరేట్స్‌ ఆఫ్‌ కరీబియన్‌' తరహాలో ఈ చిత్రాన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలని భావిస్తోంది. బాహుబలి చిత్రంతో ఓవర్సీస్‌ మార్కెట్‌ డెప్త్‌ తెలియడంతో ఇంతవరకు ఇండియన్‌ సినిమా క్యాప్చర్‌ చేయని మార్కెట్‌పై ఈ చిత్రం దృష్టి పెడుతోంది.

 

మొత్తానికి బాహుబలి వల్ల బాలీవుడ్‌ కార్యకలాపాల్లో స్పష్టమైన మార్పులొచ్చాయి. అయితే అంతిమ ఫలితం బాహుబలిలా వుంటుందా లేక ఎవరినో చూసి ఎవరో వాత పెట్టుకున్న చందంగా తయారవుతుందా అనేది చూడాలి.

loader