కూతురితో ఆమిర్ ఖాన్ ఫోటో.. అసభ్యకరంగా ఉందంటూ కామెంట్లు!

aamir khan gets trolled for posting a photo with his daughter
Highlights

బాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఆమిర్ ఖాన్. వివాదాలకు 

బాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఆమిర్ ఖాన్. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే ఈ హీరో తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో కారణంగా విమర్శలపాలవుతున్నాడు. తన కూతురి ఈరాఖాన్ తో కలిసి పార్క్ లో దిగిన ఫోటోను ఆమిర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.

కుమార్తెతో కలిసి ఇలాంటి ఫోటోలు ఎలా తీసుకుంటారు.. అది కూడా పవిత్రమైన రంజాన్ మాసంలో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ఒక ముస్లిం అయిన నువ్వు రంజాన్ మాసంలో ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుండాలి.. రంజాన్ సందర్భంలోనైనా మంచి బట్టలు ధరించాలి అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఆమిర్ ను సపోర్ట్ చేస్తూ.. 'ప్రపంచంలోనే బెస్ట్ రిలేషన్షిప్ ఇది.. తండ్రి కుమార్తెల ప్రేమకు చిహ్నమిది.. ఒక తండ్రి ఎదిగే తన కూతురితో ఆడుకోకుడదా..? ఈ ఫోటోలో కూతురికి బదులు కొడుకు ఉంటే ఇలానే అనేవారా..? అంటూ ప్రశ్నించారు.  

loader