Asianet News TeluguAsianet News Telugu

పెళ్లిచూపులు, శతమానం భవతికి జాతీయ అవార్డులు

64 వ జాతీయ చలనచిత్రాల అవార్డులను ప్రకటించిన కేంద్రం

64th National Film Awards Heres the complete list of winners

జాతీయస్థాయి చలన చిత్రాల అవార్డుల్లో టాలీవుడ్ పంట పండింది. 64 వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లిచూపులు నిలవగా, ఇదే సినిమాకు మాటలు రాసిన తరుణ్ భాస్కర్ కు ఉత్తమ సంభాషణల రచయితగా అవార్డు దక్కింది. 

జనతా గ్యారేజ్ సినిమాకుగాను కొరియాగ్రఫీ చేసిన రాజు సుందరానికి ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు దక్కింది. శతమానంభవతికి ఉత్తమ ప్రజాదరణ చిత్రం అవార్డు దక్కింది.

జాతీయ చలన చిత్ర అవార్డుల వివరాలు....

ఉత్తమ చిత్రం - కాసవ్ (మరాఠీ)
ఉత్తమ నటుడు - అక్షయ్ కుమార్ (రుస్తుం)
ఉత్తమ నటి - సురభి (మిన్నమినుంగు, మలయాళం)
ఉత్తమ దర్శకుడు - రాజేష్ (వెంటిలేటర్)
ఉత్తమ సహాయ నటి - జైరా వసీమ్ (దంగల్)
ఉత్తమ హిందీ చిత్రం - నీర్జా
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం - శివాయ్
ఉత్తమ సామాజిక చిత్రం - పింక్
ఉత్తమ గాయకుడు - సుందర అయ్యర్ (జోకర్, తమిళం)
ఉత్తమ గాయని - ఇమాన్ చక్రవర్తి (ప్రక్తాన్)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ - పీటర్ హెయిన్
ఉత్తమ బాలల చిత్రం - ధనక్ (నగేశ్ కుకునూర్)

తెలుగు సినిమాకు జాతీయ పురస్కారాలు 

ఉత్తమ తెలుగు చిత్రం - పెళ్లి చూపులు
ఉత్తమ నృత్య దర్శకుడు - రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ సంభాషణలు - తరుణ్ భాస్కర్ (పెళ్లి చూపులు)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - శతమానం భవతి

Follow Us:
Download App:
  • android
  • ios