రెండు రాష్ట్రాలకి ఒక్క లీడర్.. ది దేవరకొండ: విజయ్ దేవరకొండ ట్వీట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 7, Sep 2018, 6:12 PM IST
5 million digital views for nota movie trailer
Highlights

'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా విడుదలైన 'గీత గోవిందం' చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. 

'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా విడుదలైన 'గీత గోవిందం' చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ రేంజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ హీరో నటించిన 'నోటా' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 4న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు విజయ్ దేవరకొండ. ముఖ్యమంత్రి పాత్రలోసరికొత్త గెటప్ లో విజయ్ కనిపించబోతున్నాడు.

అయితే ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లో మిలియన్ వ్యూస్ ని సాధించిన ఈ ట్రైలర్ ఇప్పటివరకు 54 లక్షల వ్యూస్ ని రాబట్టింది. దీన్ని బట్టి విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతోంది. 5 మిలియన్ వ్యూస్ ని సాధించిన సందర్భంగా విజయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ''రెండు రాష్ట్రాలకి ఒక్క రౌడీ. పొలిటీషియన్. లీడర్. ది దేవరకొండ'' అంటూ ట్వీట్ చేశాడు.  
 

 
ఇది కూడా చదవండి.. 

'ది రౌడీ'.. 'ది పాలిటీషియన్'.. విజయ్ దేవరకొండ! 

loader