టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి హెబ్బా పటేల్ కి ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆమె నటిస్తోన్న సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.

ఈ క్రమంలో ఆమెకి అరుణ్ ఆదిత్ సరసన '24 కిస్సెస్' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఘాటు రొమాంటిక్, ముద్దు సీన్లలో అమ్మడు నటించింది.ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకి భారీ స్పందన లభించింది. 

బోల్డ్ కంటెంట్ తో ఉన్న ట్రైలర్ కి 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 23న హెబ్బా 24 ముద్దులతో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 'మిణుగురులు' లాంటి అవార్డు విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

'24 కిస్సెస్' ట్రైలర్..!

డబ్బులిచ్చారు.. ముద్దులు పెట్టా.. హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు

ముద్దు సీన్లలో చెలరేగిపోయింది.. మరి వర్కవుట్ అవుతుందా..?