'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత టాలీవుడ్ కి ముద్దుల ఫీవర్ పట్టుకుంది. కథ ఏదైనా, కంటెంట్ ఏమున్నా.. జోనర్ తో సంబంధం లేకుండా సినిమాలో ముద్దు సీన్లకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో లిప్ లాక్ సీన్స్ లేకుండా విడుదలయ్యే సినిమాల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోంది

'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత టాలీవుడ్ కి ముద్దుల ఫీవర్ పట్టుకుంది. కథ ఏదైనా, కంటెంట్ ఏమున్నా.. జోనర్ తో సంబంధం లేకుండా సినిమాలో ముద్దు సీన్లకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో లిప్ లాక్ సీన్స్ లేకుండా విడుదలయ్యే సినిమాల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోంది. పైగా ఈ ముద్దు సీన్లతో సినిమాపై హైప్ పెరిగే విధంగా చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

టీజర్, ట్రైలర్ ద్వారా లిప్ లాక్స్ సీన్స్ ఉన్నాయని చెబుతూ యూత్ ని ఆకర్షిస్తున్నారు. తాజాగా విడుదలైన '24 కిస్సెస్' సినిమా ట్రైలర్ కూడా లిప్ లాక్స్ తో నింపేశారు. టైటిల్ కి తగ్గట్లే ట్రైలర్ లో కిస్సెస్ లెక్కకు మించి ఉన్నాయి. అసలు కథ ఏంటి అనేది ట్రైలర్ ద్వారా చెప్పకుండా డీప్ కిస్సులుంటాయని మాత్రం చెబుతున్నారు. పైగా ఆ ముద్దు సీన్లలో యూత్ ఫేవరెట్ హీరోయిన్ హెబ్బా పటేల్ నటించడం విశేషం.

ఈ ఇంటిమేటెడ్ సీన్స్ లో హెబ్బా చెలరేగిపోయింది. 'మిణుగురులు' వంటి నేషనల్ అవార్డు సినిమాను రూపొందించిన దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణం శెట్టి ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. అదిత్ అరుణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మరి ఈ లిప్ లాక్స్ సినిమాను ఎంతవరకు కాపాడతాయో చూడాలి!