2018 కోసం సినీ అభిమానులు వెయిటింగ్!

First Published 10, Dec 2017, 9:24 AM IST
2018 to begin with pawan kalyan movie agnathavaasi
Highlights

2017 లో  తెలుగు సినిమాల సక్సెస్ రేట్ కాస్త తగ్గిందనే చెప్పాలి.

ఈ ఏడాది విడుదలైన చిత్రాలు మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి. సక్సెస్ రేట్ కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ బిజినెస్ పరంగా మాత్రం టాలీవుడ్ స్థాయి బాగా పెరిగింది. అయితే వచ్చే ఏడాది కోసం మాత్రం సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరి నుండి టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలుకానుంది. ఓపెనింగ్ సినిమా పవన్ కల్యాణ్ ది కావడం విశేషం. ముందుగా జనవరి 10న పవన్ కల్యాణ్ తన 'అజ్ఞాతవాసి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పవన్ సినిమా తరువాత మార్చి 30న రామ్ చరణ్ 'రంగస్థలం' రెడీ అవుతోంది. 1985 బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. 

దానికి తగ్గట్లుగా సినిమాలో రామ్ చరణ్ లుక్ మరింత ఆకట్టుకుంటోంది. చరణ్ సినిమా తరువాత ఏప్రిల్ లో బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు తను నటిస్తోన్న 'భరత్ అనే నేను' చిత్రంతో రంగంలోకి దిగబోతున్నాడు. కొరటాల-మహేష్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇక అదే నెలలో అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నాలుగు సినిమాలతో పాటు శంకర్-రజినీకాంత్ ల కాంబోలో రూపొందుతోన్న '2.0' కూడా విడుదల కాబోతుంది. మొత్తానికి ఈ క్రేజీ ప్రాజెక్టులు అన్నీ కూడా 2018 పై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. 

సండే హైలైట్స్

 

మణి రత్నం సినిమా నుండి తప్పుకున్నాడు

https://goo.gl/wRBK34

 

 

కొత్త చిత్రం కోసం రెడీ అవుతున్న రవితేజ

http://telugu.asianetnews.com/entertainment/raviteja-getting-ready-for-a-new-movie

loader