సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఈరోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. విడుదలైన కొద్దీ గంటల్లోనే ఈ సినిమా 2 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

మీసం, గడ్డం సరికొత్త లుక్ తో మహేష్ అలా నడుచుకుంటూ వస్తోన్న ఈ టీజర్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే డెహ్రాడూన్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు రిషి అనే పాత్రలో కనిపిస్తుండగా అల్లరి నరేష్ రవి అనే మరో కీలక పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.