చిత్రం... 16 నటీనటులు... రెహమాన్, ప్రకాశ్ విజయ రాఘవన్ దర్శకత్వం... కార్తిక్ నారైన్ నిర్మాతలు... చదలవాడ పద్మావతి సంగీతం... జెక్స్ బిజోయ్

కథ...

దీపక్ అనబడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో ఈ కథ మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశపడే ఒక యువకుడు దీపక్ దగ్గరకు వచ్చి పోలీస్ ఉద్యోగం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటాడు. కానీ అప్పటికే ఒక కేసు విషయంలో తన కాలు కోల్పోయిన దీపక్ పోలీస్ ఉద్యోగంలో చేరవద్దని ఆ యువకుడికి చెప్తూ 5 ఏళ్ల క్రితం తను ఇన్వెస్టిగేషన్ చేసిన ఒక కేసును గురించి వివరించడం మొదలుపెడతాడు. ఆ కేసులో ఒక హత్య, ఒక హిట్ అండ్ రన్, ఒక యువతి మిస్సింగ్ వంటి మూడు విడి విడి కేసులు కలిసి ఉంటాయి. ఆ మూడు కేసులను దీపక్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు? ఒక కేసుకు, ఇంకో కేసుకు సంబంధం ఏంటి.. దీపక్ ఆ కేసులో నిజాన్ని ఎలా తెలుసుకున్నాడు ? చివరికి ఆ కేసుకి న్యాయం ఎలా చెప్పబడింది, ఎవరి చేత చెప్పబడింది ? అనేదే తెరపై నడిచే కథ.

సాంకేతిక విభాగం...

ఒక క్రైమ్ కథకు థ్రిల్లింగా ఉండే అల్లికలాంటి తెలివైన కథానాన్ని జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకోవడంలో, దాన్ని అలాగే తెరకెక్కించడంలో కార్తిక్ నరేన్ ఒక దర్శకుడిగా, రచయితగా 99 % సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండి సినిమాకు నూటికి నూరు శాతం సహాయపడ్డాయి. క్లిష్టమైన ఈ చిత్ర కథనానికి శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ చాలా బాగా దోహదపడింది. శివరాం ప్రసాద్ గోగినేని అందించిన తెలుగు మాటలు, పాత్రల డబ్బింగ్ వాయిస్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి.

ప్లస్ పాయింట్స్...

దర్శకుడు కార్తిక్ నరేన్ సినిమాను నడిపిన విధానం

రహమాన్ నటన సినిమాకు కావాల్సినంత ప్లస్సయింది

ఫస్టాఫ్ లో పోలీస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ తాలూకు సన్నివేశాలు

సెకండాఫ్ లో రివీలైన ఒక్కొక్క ప్రశ్నకు ఊహకందని జవాబులతో క్లైమాక్స్

మైనస్ పాయింట్స్...

ఫస్టాఫ్ లో సామాన్య ప్రేక్షకుడికి అంత త్వరగా అందని కొన్ని లాజిక్స్

ప్రేక్షకుల మీదకి ప్రశ్నల మీద ప్రశ్నలు వదులుతూ సమాధానాలు కనుక్కోండి చూద్దాం అన్నట్టు ఉండే కథనం

క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నా థియేటర్లోంచి బయటికి వచ్చేప్పుడు కొన్ని సమాధానాలు వెతుక్కోవాల్సి రావాడం

ప్రేక్షకున్ని తికమక ప్రశ్నలతో గందరగోళపరచడం

చివరగా...

తికమకపెట్టినా అదే కరెక్ట్ అనిపించే క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ సినిమా