'బాహుబలి'సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా 'సాహో'. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ లో భాగంగా కొన్ని కార్లను, ట్రక్ లను ధ్వంసం చేశారు. గ్రాఫిక్స్ లో చూపించడం కంటే రియలిస్టిక్ గా ఉంటే బాగుంటుందని సినిమా కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు.

వందల కోట్ల ఖర్చుతో ఎలాంటి కథ తెరకెక్కిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది. ఒక్క దుబాయ్ ఎపిసోడ్ కోసమే కొన్ని ఖర్చు చేస్తున్నారు. హోటల్ బిల్స్, ట్రావెల్ టికెట్స్ కోసం అక్షరాల రూ.15 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. యూనిట్ సభ్యులను ఎక్కువ మందిని దుబాయ్ కి తీసుకువెళ్ళడంతో ఆ రేంజ్ లో ఖర్చు అవుతోంది. ఇక దర్శకుడు సుజీత్ ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికి ముంబైలో యువి క్రియేషన్స్ సంస్థ ఓ ఆఫీస్ ను దేర్పాటు చేసుకుందట. ముంబైలో ఉన్న సినిమా ఆఫీసులకు ఏమాత్రం తీసిపోని విధంగా సాహో ఆఫీస్ ఉందని టాక్.