Asianet News TeluguAsianet News Telugu

`స‌రైనోడు`అలాంటిలాంటి రికార్డ్ కాదు..నేషనల్ రికార్డ్!

  • టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.... తన సినిమాల మార్కెట్ పరిధిని క్రమక్రమంగా తెలుగు రాష్ట్రాల బోర్డర్ దాటిస్తున్నారు
  • ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఓరిస్సాలో బన్నీ తన ఫ్యాన్ బేస్ పటిష్టం చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే.
  • నార్తిండియా మార్కెట్లోకి స్టైలిష్ స్టార్ ఇంకా అడుగు పెట్టనప్పటికీ.... యూట్యూబ్ లాంటి డిజిటల్ మీడియాలో బన్నీ డబ్బింగ్ సినిమాల హవా కొనసాగుతోంది
145M Views and 500K Likes For Sarrainodu Hindi Dubbed Movie

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.... తన సినిమాల మార్కెట్ పరిధిని క్రమక్రమంగా తెలుగు రాష్ట్రాల బోర్డర్ దాటిస్తున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఓరిస్సాలో బన్నీ తన ఫ్యాన్ బేస్ పటిష్టం చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. నార్తిండియా మార్కెట్లోకి స్టైలిష్ స్టార్ ఇంకా అడుగు పెట్టనప్పటికీ.... యూట్యూబ్ లాంటి డిజిటల్ మీడియాలో బన్నీ డబ్బింగ్ సినిమాల హవా కొనసాగుతోంది. తాజాగా బన్నీ నటించిన 'సరైనోడు' హిందీ డబ్బింగ్ వెర్షన్ ఆలిండియా రికార్డు నెలకొల్పింది.

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరైనోడు' చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో జనవరి 30వ తేదీ నాటికే 130 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం మహా మహా సినిమాలను వెనక్కి నెట్టేస్తూ 145 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని టాప్ పొజిషన్లో నిలిచింది.

సింగిల్ చానల్‌లో 145 మిలియన్ వ్యూస్ సాధించడం ఆల్ టైమ్ ఇండియన్ సినిమా యూట్యూబ్ రికార్డుగా విశ్లేషకులు చెబుతున్నారు. నార్త్ ఇండియాలో బన్నీ సినిమాల మార్కెట్ పెరగడం మంచి పరిణామం అని, దీని వల్ల భవిష్యత్తులో బన్నీ సినిమాలకు డిజిటల్ రైట్స్ భారీ ధర పలికే అవకాశం ఉందని అంటున్నారు.

‘సరైనోడు' చిత్రాన్ని బన్నీ సొంత బేనర్ గీతా ఆర్ట్స్ వారు నిర్మించారు. ఈ చిత్రం దాదాపు రూ. 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో దాదాపు రూ. 80 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించగా, ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు.

తను నటించిన ‘సరైనోడు' చిత్రం నేషనల్ రికార్డు సాధించిన నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు

బన్నీ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య' చిత్రంలో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ జవానుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.