యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. 

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఓ వాణిజ్య ప్రకటన కోసం ముంబై వెళ్లి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తుండగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి తిరిగి వస్తున్న సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్స్ ఎన్టీఆర్ ని చుట్టుముట్టి ఫోటోలు తీయడం ప్రారంభించారు. 

దీనితో ఎన్టీఆర్ ఓ ఫోటో గ్రాఫర్ ని దగ్గరకు పిలిచాడు. నువ్వు ఇక్కడే ఉంటావా.. తిండి, స్నానం అన్ని ఇక్కడేనా అని ప్రశ్నించాడు. ఎన్టీఆర్ ముంబైకి వెళ్లే సమయంలో కూడా అదే ఫోటో గ్రాఫర్ ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. దీనితో ఎన్టీఆర్ అతడిని గుర్తుపట్టి ఆటపట్టించాడు. 

ప్రియురాలితో బిగ్ బాస్ సెలెబ్రిటీ రహస్య వివాహం?

స్వయంగా ఎన్టీఆర్ తనని గుర్తుపట్టడంతో సదరు ఫోటో గ్రాఫర్ సంతోషానికి అవధులు లేవు. ఫోటో గ్రాఫర్ తో సరదా సంభాషణ ముగిసిన వెంటనే ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 

సెక్సువల్ కామెంట్స్.. అజిత్, షాలిని దంపతులని ఇరకాటంలో పెట్టిన నటి!

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో ఎలా కనిపిస్తాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయాలని భావించారు. తాజాగా సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అక్టోబర్ కు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. 

కుర్రాళ్ళ హృదయాలు గల్లంతయ్యే హాట్ నెస్.. రాశి ఖన్నా ఫొటోస్