సీనియర్ నటి కస్తూరి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. కస్తూరి 90వ దశకంలో తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో నిప్పురవ్వ, అన్నమయ్య లాంటి ప్రధాన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కస్తూరి తమిళ చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. 

కస్తూరి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే నటి. సామజిక రాజకీయ అంశాలపై కూడా కస్తూరి తన అభిప్రాయాలని పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో కస్తూరికి, తమిళంలో టాప్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న తలా అజిత్ ఫ్యాన్స్ కి మధ్య వార్ జరుగుతోంది. 

అజిత్ ఫ్యాన్స్ కస్తూరిని ట్రోల్ చేస్తుండడంతో.. ఆమె 'డర్టీ అజిత్ ఫ్యాన్స్' అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ చేస్తోంది. ఈ క్రమంలో కొందరు అజిత్ ఫ్యాన్స్ కస్తూరిపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.  కూడా అంతే ఘాటుగా బదులిచ్చింది. అమ్మాయిలని చూస్తే నీకు సెక్స్ మాత్రమే గుర్తుకు వస్తే మీ అమ్మ, చెల్లి దగ్గరకు వెళ్ళు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 

దీనితో కస్తూరి, అజిత్ అభిమానుల మధ్య వార్ మరింతగా పెరిగింది. ఈ క్రమంలో కొందరు కస్తూరికి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో కస్తూరి.. అజిత్, అతడి సతీమణి షాలినిని కూడా ఇరకాటంలో పెట్టింది. తాజాగా ట్వీట్ చేస్తూ ఈ వ్యవహారంలోకి అజిత్, షాలిని లని కూడా లాగింది. 

 

'నాకు మద్దతు తెలుపుతూ చాలా మంది మెసేజ్ లు పెట్టారు. వారందరికీ కృతజ్ఞతలు. నా వెనుక నిలబడి మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన వారందరికీ రుణపడి ఉంటాడు. ఈ సందర్భంగా అజిత్, షాలినీలని కూడా రిక్వస్ట్ చేస్తున్నా. వారిద్దరూ నాకు మద్దతు తెలపాలి' అని కస్తూరి కోరుతూ ట్వీట్ చేసింది. 

అమ్మాయిని చూస్తే సెక్స్ మాత్రమే గుర్తొస్తుందా..? స్టార్ హీరో ఫ్యాన్స్ పై నటి ఫైర్!

మరి కస్తూరి రిక్వస్ట్ కు స్పందించి అజిత్, షాలినిలు ఈ ఘటనని ఖండిస్తారో లేదో చూడాలి. ఇతర హీరోల అభిమానులతో గొడవలు జరిగినప్పుడు తనకు, తన అభిమాన సంఘాలకు ఎలాంటి సంబంధం లేదని అజిత్ తేల్చేశాడు. కానీ అజిత్ అంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ తమిళనాడులో ఉన్నారు. 

లుక్ టెస్ట్ కంప్లీట్.. మొఘల్ సామ్రాజ్యంలో పవన్.. ఉత్కంఠ రేపేలా క్రిష్ చిత్రం!