ఇండియాలో బిగ్ బాస్ షోకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షో ప్రస్తుతం అన్ని భాషల్లో నిర్వహిస్తున్నారు. బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది సెలెబ్రిటీలు తమ పాపులారిటీ పెంచుకుంటున్నారు. అప్పటివరకు ఎలాంటి గుర్తింపు లేనివారు కూడా బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. 

తమిళ బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా నటుడు మహత్ రాఘవేంద్రకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం రాఘవేంద్ర పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తమిళంలో అనేక చిత్రాల్లో మహత్ కు క్యారెక్టర్ రోల్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా హాట్ బ్యూటీ, మోడల్ అయిన ప్రాచి మిశ్రా, మహత్ మధ్య చాలా కాలంగా ఎఫైర్ సాగుతోంది. 

వీరిద్దరూ సహజీవనం కూడా చేశారు. వీరి ప్రేమకు పెద్దల నుంచి అంగీకారం లభించడంతో గత ఏడాది ఏప్రిల్ లో నిశ్చితార్థం జరిగింది. తాజా సమాచారం మేరకు వీరిద్దరూ వివాహానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

అందాల దేవతలా కాజల్ అగర్వాల్.. చీరకట్టులో ఆ సోయగం చూశారా!

ఎలాంటి హడావిడి లేకుండా రహస్యంగా వివాహం చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నారు. ఫిబ్రవరిలో వీరి వివాహం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది.