మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. టాలీవుడ్ లో ఒకరు మెగాస్టార్ అయితే మరొకరు లేడీ సూపర్ స్టార్ గా ఖ్యాతి గడించారు. చిరు, విజయశాంతి కాంబోలో కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. 

90వ దశకం తర్వాత చిరంజీవి, విజయశాంతి మరోసారి వెండితెరపై కనిపించలేదు. ఆ మాటకొస్తే దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. విజయశాంతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి ప్రొఫెసర్ భారతిగా కీలక పాత్రలో నటిస్తోంది. 

హీరోయిన్ సెక్సీ డాన్స్, వీడియో వైరల్.. నెటిజన్ల ట్రోలింగ్!

ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న అంశాల్లో విజయశాంతి పాత్ర కూడా ఒకటి. సంక్రాంతి కానుగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జనవరి 5న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ కూడా ఖరారైపోయారు. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి మహేష్ బాబు సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న సంగతి తెలిసిందే. 

ఎగిరి గంతేసిన హీరోయిన్.. జూ.ఎన్టీఆర్ పై ముద్దుల వర్షం!

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరు, మహేష్ బాబు కంటే.. చిరు, విజయశాంతి లని ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. 90 దశకంలో ఒక ఊపు ఊపిన ఈ జోడి ఒకే వేదికపై చాలా ఏళ్ల తర్వాత కనిపించబోతుండడం ఆసక్తిని రేపుతోంది. 

అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్. అనిల్ సుంకర, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

తప్పు మీద తప్పు.. అందుకే గ్యాప్ తీసుకున్నా : శ్రీనువైట్ల