ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాప్ సినిమాలు తీస్తున్నాడు. 'బ్రూస్ లీ', 'మిస్టర్', 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఇలా ఆయన తీసిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. కొత్త ఏడాదిలో బౌన్స్ బ్యాక్ అవుతానని చెబుతున్నాడు శ్రీనువైట్ల.

ఈ ఏడాదే సినిమా చేద్దామని చాలా అనుకున్నామని.. కానీ తప్పుల మీద తప్పులు చేయడం ఇష్టం లేదని అన్నారు. బ్రేక్ తీసుకుందామని అనుకున్నట్లు.. అందుకే ఎవరికీ కనిపించలేదని అన్నారు. నిజానికి తనకు ఏదైనా ఐడియా కనెక్ట్ అయితే స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్లిపోతానని.. వర్కవుట్ అవుతుందా అవ్వదా..? అని వెనక్కి తిరిగి చూసుకోలేదని.. కానీ ఈసారి కంగారు పడదలుచుకోలేదని.. చేసేది పక్కాగా చేద్దామని గ్యాప్ తీసుకున్నట్లు చెప్పారు.

ముదురు భామలతో కుర్ర హీరోల ఘాటు రొమాన్స్!

ఆడియన్స్ కూడా చాలా మారిపోయారని.. కథను గట్టిగా డిమాండ్ చేస్తున్నారని అన్నారు. సరైన కథ  లేకుండా ఏం చేసినా యాక్సెప్ట్ చేయడం లేదని అన్నారు. కొత్త కథలో ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి చెప్పడం చిన్న విషయం కాదని.. అలాంటి కథలను పట్టుకొని పక్కనపెట్టి, ఫైనల్ గా అందులో నుండి ఒకటి అనుకున్నానని చెప్పారు.

దాదాపు 70 శాతం స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని.. కొత్త ఏడాదిలో సినిమాని అనౌన్స్ చేస్తానని చెప్పారు. వరుస ఫ్లాప్ ల వలన తను కుంగిపోలేదని అంటున్నారు వైట్ల. శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారయ్యానని.. కొన్నేళ్లుగా కుటుంబ పరంగా పూర్తిచేయాల్సిన పనుల్ని పూర్తి చేయడానికి సమయం దొరికిందని చెబుతున్నారు.