నదియా, ఖుష్బూ, టబు లాంటి హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలతో దూసుకుపోతున్నారు. అలనాటి అందాల తార ఖుష్బూ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఖుష్బూని అందాల దేవతలా ఆరాధిస్తూ తమిళ అభిమానులు గుడి కూడా కట్టేశారు. ఖుష్బూ పేరుతో తమిళనాడులో ఇడ్లీ లాంటి వంటకాలు కూడా ఫేమస్ అయిపోయాయి. 

ఖుష్బూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో యమదొంగ, స్టాలిన్, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల ఖుష్బూ కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ షోకు అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో అలీతో ఆమె కెరీర్ కు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు. 

త్వరలో ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే షో చాలా సరదాగా జరిగినట్లు కనిపిస్తోంది. ఇక ఖుష్బూ తన అభిమాన నటుల గురించి కూడా ఈ షోలో ప్రస్తావించింది. తమిళంలో తన అభిమాన నటుడు అరవింద స్వామి అనిక్ చెప్పింది. ఇక తెలుగులో తన ఆమె అభిమాన హీరో ఎవరో నేను చెబుతా అంటూ అలీ ఓ ఫోటో చూపించారు. స్క్రీన్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటో కనిపించగానే ఖుష్బూ సంతోషంతో ఎగిరి గంతేసింది. 

ఎన్టీఆర్ ఫోటోపై ఫ్లైయింగ్ కిస్సుల వర్షం కురిపించింది. విక్టరీ వెంకటేష్ నటించిన కలియుగ పాండవులు చిత్రంతో ఖుష్బూ హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 

'దూకుడు'పై నాకు డౌట్ ఉండేది.. ఎప్పుడూ చేయని పని చేశా.. శ్రీను వైట్ల!

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తన వయసుకు సరిపడే పాత్రలు వచ్చినప్పుడు నటిస్తోంది. ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో ఖుష్బూ యముడికి భార్య పాత్రలో నటించారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన ఖుష్బూ అతడికి అభిమానిగా మారిపోయింది. 

వైరల్ న్యూస్ పై మహేష్, బన్నీ ఫ్యాన్స్ రచ్చ!