హీరొయిన్ ఆండ్రియా ఆశించిన స్టార్ డమ్ అందుకోలేకపోయింది. కానీ బోల్డ్ కామెంట్స్, వివాదాస్పద సంఘటనలతో ఆండ్రియా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. వివాదాలతో క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ అవేమి ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టలేదు. 

విశ్వరూపం లాంటి చిత్రాల్లో కీలక పాత్రలో నటించింది. మరికొన్ని మూవీస్ లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసింది. తాజాగా మరోమారు ఆండ్రియా వార్తల్లో నిలిచింది. ఓ మ్యూజికల్ షోలో ఆండ్రియా పాల్గొంది. ఆ షోలో చిట్టి పొట్టి డ్రెస్ లో మెరుస్తూ డాన్స్ చేసింది. పాప్ సింగర్ తరహాలో పాట పడుతూ అలరించింది. స్వతహాగా ఆండ్రియా మంచి సింగర్. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Va va pakkam va 😋 #aboutlastnight #birthdaygirl #thejeremiahproject Thanks @amritha.ram for this BOMB 👗 ❤️

A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) on Dec 21, 2019 at 11:56pm PST

ఆ మ్యూజికల్ షో వీడియోను ఆండ్రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆండ్రియా డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనితో ఈ వీడియో వైరల్ గా మారింది. మరికొందరు మాత్రం ఆండ్రియా వేసుకున్న డ్రెస్ పై కామెంట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. 

హైపర్ ఆది, యాంకర్ వర్షిణి మధ్య ఏం జరుగుతోంది ?

తనని ట్రోలింగ్ చేస్తున్న వారిపై ఆండ్రియా ఘాటుగా కామెంట్స్ చేసింది. నా డ్రెస్ ఎందుకు చూస్తారు.. డాన్స్ మాత్రమే ఎంజాయ్ చేయండి అని పేర్కొంది. ఎలాంటి విషయం గురించి అయినా ఆండ్రియా బెదురు లేకుండా మాట్లాడేస్తుంది. ఆ మధ్యన తనకు ఓ పెళ్ళైన సెలెబ్రిటీతో సహజీవనం చేశానని.. అతడి నుంచి విడిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లానని ఆండ్రియా పేర్కొంది. 

పెళ్లి అందుకే సీక్రెట్ గా, నా భర్త వల్లే ఇప్పటికీ .. హీరోయిన్ శ్రీయ!

అతడి పేరు మాత్రం చెప్పనని, తాను రాసే ఓ పుస్తకంలో అన్ని విషయాలు రివీల్ చేస్తానని ఆండ్రియా పేర్కొంది. ఇటీవల ఆండ్రియా ఆయుర్వేద వైద్యంతో నాజూగ్గా మారింది. తన అందాన్ని బయట పెట్టేందుకే ఆండ్రియా ఈ వీడియో పోస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైనా ఆండ్రియాకు మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.