విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. బోల్డ్, ఎమోషనల్ ప్రేమా కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ దుమ్మురేపుతోంది. 

ఈ చిత్రంలో కూడా విజయ్ దేవరకొండ రొమాన్స్ ఇరగదీస్తున్నాడు. అర్జున్ రెడ్డి తరహాలోనే రొమాన్స్ ఘాటు ఎక్కువైందని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రం యువతని ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది. రాశి ఖన్నా, ఇజా బెల్లె, కేథరిన్, ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఈ చిత్ర టీజర్ లో విజయ్ దేవరకొండ పేరు దేవరకొండ విజయ్ సాయి అని కనిపిస్తోంది. దీనితో విజయ్ దేవరకొండ పేరు మార్చుకున్నాడా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేదు. గీతా గోవిందం తర్వాత వచ్చిన నోటా చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

షాక్ :నాగబాబుకు భారీ షాకిచ్చిన ‘అదిరింది’ రేటింగ్

ఆ తర్వాత వచ్చిన టాక్సీ వాలా మూవీ పర్వాలేదనిపించింది. గత ఏడాది విడుదలైన డియర్ కామ్రేడ్ చిత్రం విజయ్ దేవరకొండకు నిరాశనే మిగిల్చింది. తరచుగా ఫ్లాపులు ఎదురవుతుండడంతో విజయ్ దేవరకొండ న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్నాడనే చర్చ ఉహాగానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ అసలు పేరు దేవరకొండ విజయ్ సాయినే. కానీ సినిమాల్లో మాత్రం విజయ్ దేవరకొండ అని టైటిల్ కార్డ్స్ లో పడుతోంది. 

చీరకట్టులో సమంత.. టాటూ కనిపించేలా గ్లామర్ షో!

అర్జున్ రెడ్డి చిత్రంలో దేవరకొండ విజయ్ సాయి అనే టైటిల్ కార్డ్స్ లో పడుతుంది. అభిమానుల్లో విజయ్ దేవరకొండ పేరు పాపులర్ కావడంతో ఆ తర్వాతి చిత్రాల్లో అదే పేరు వేస్తూ వచ్చాయి. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో దర్శకుడు క్రాంతి మాధవ్ తిరిగి దేవరకొండ విజయ్ సాయి అనే వేస్తున్నాడు. క్రాంతి మాధవ్ సాయిబాబా భక్తుడట. అందుకే విజయ్ దేవరకొండ పేరులో సాయి వచ్చే విధంగా టైటిల్ కార్డ్స్ లో వేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆ హీరో వర్జిన్ కాదు.. పచ్చి అబద్దం అంటున్న హీరోయిన్!