ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ పోగ్రాంకు డైరక్ట్ ఛాలెంజ్ వదిలారు నాగబాబు. ఈ మేరకు ఆయన అఫీషియల్ గా ప్రకటన కూడా చేసారు. దాదాపు ఏడేళ్లు పాటు ఈటీవీ ‘జబర్దస్త్’ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు రీసెంట్ గా ఆ షో నుండి బయటకు వచ్చేసి.. జీ తెలుగులో ‘అదిరింది’ అనే కొత్త షోకి జడ్జిగా పోగ్రాం స్టార్ట్ చేసారు. నాగబాబుతో పాటు ఆయన తో పాటు జబర్దస్ లో చేసిన కమిడయన్స్  చమ్మక్ చంద్ర, ఆర్పీ, ధనరాజ్, వేణులు అదిరింది షోకి టీం లీడర్స్‌గా  చేసారు.

అలాగే.. జబర్దస్త్ షో నుండి ముందే బయటకు వచ్చేసిన నితిన్ భరత్‌లు అదిరింది షోని డైరెక్ట్ చేస్తున్నారు. వీరందరితో కలిసి .. జీ తెలుగులో ఆదివారం నాడు ‘అదిరింది’ షో టెలికాస్ట్ అయ్యింది.  ఈ నేపధ్యంలో ఈ షోకు వచ్చిన టీఆర్పీలు ఎలా ఉండబోతోన్నాయనే విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది.

చిరంజీవి, మహేష్, విజయశాంతి ఎఫెక్ట్.. పోలీసులు ఏం చేస్తున్నారంటే..
అందుతున్న సమాచారం మేరకు జబర్దస్త్ పోగ్రాం ఎప్పటిలాగే ఐదు నుంచి ఆరు దాకా రేటింగ్ లు తెచ్చుకుంది. అదే సమయంలో కొత్తగా ప్రారంభమైన అదిరింది పోగ్రామ్ ...0.5 రేటింగ్ తెచ్చుకుని షాక్ ఇచ్చింది. ఈ రేటింగ్ చాలా పూర్ అని చెప్పాలి. జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర వంటి వారు వచ్చి పోగ్రాం చేసినా ఈ స్దాయిలో దెబ్బ కొట్టడం ఎవరూ ఊహించలేదు. అలాగని ఇది పూర్తిగా వర్కవుట్ కాలేదు, ఫెయిల్యూర్ అని అనలేం అంటున్నారు మీడియా విశ్లేషకులు.

ఆ హీరో వర్జిన్ కాదు.. పచ్చి అబద్దం అంటున్న హీరోయిన్!

జీతెలుగులో అదిరింది అనే పోగ్రాం..జబర్దస్త్ కు పోటీగా వస్తోందనే విషయం గుర్తు పెట్టుకుని ఎంత మంది చూసారనేది ఇక్కడ చూడాలని అంటున్నారు. అలాగే జబర్దస్త్ పోగ్రాం ఎప్పటినుంచో ఉంటోంది కాబట్టి , పోగ్రాం ఎలా ఉన్నా దానికుండే వీక్షకులు దానికి ఉంటారు. అదే అదిరింది కు మైనస్. ఇఫ్పుడే ప్రారంభమైన బిడ్డ అది. ఇంకా కొంతకాలం పోతేకానీ అదిరింది ఏ స్దాయి విజయం సాధించింది అనేది చెప్పలేం..  

జబర్దస్త్ లో రోజా మార్క్ పాలిటిక్స్.. నాగబాబు ప్లేస్ ఆయనదే ?