కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఇటీవలే సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ 3 చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఇక సల్లూ భాయ్ బిగ్ బాస్ సీజన్ 13తో బిజీ అయిపోయాడు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 13 ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

ఇటీవల బిగ్ బాస్ 13కు బాలీవుడ్ క్రేజీ కపుల్స్ అజయ్ దేవగన్, కాజోల్ అతిథులుగా హాజరయ్యారు. బిగ్ బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ వీరిద్దరితో చేసిన సందడి చేసి అలరించాడు. ఈ షోలో కాజోల్ అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ ఇద్దరికీ సరదాగా లైవ్ డిటెక్ట్ టెస్ట్ పెట్టింది. 

మీ లైఫ్ లో ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ కన్నా తక్కువ లేరు కదా అని సల్మాన్ ఖాన్ ని ప్రశ్నించింది. తన జీవితం మొత్తంలో ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని సల్మాన్ బదులిచ్చాడు. దీనితో పక్కనే ఉన్న అజయ్ దేవగన్.. నీకు ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా ఓ ఇంటర్వ్యూలో వర్జిన్ అని చెప్పావు కదా అని ప్రశ్నించాడు. నాకు పెళ్లి కాలేదు కాబట్టి నేను వర్జిన్ నే అని మరోసారి సల్మాన్ ఖాన్ తెలిపాడు. 

ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసిన మహేష్ .. మచిలీపట్నంలో ఏం జరిగిందంటే!

దీనికి కాజోల్ ఫన్నీగా బదులిచ్చింది. ఇది పచ్చి అబద్దం అని పేర్కొంది. దీనితో బిగ్ బాస్ షోలో నవ్వులు విరిశాయి. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని కాజోల్ ప్రశ్నించగా.. దానికింకా సమయం ఉందని సల్మాన్ ఎప్పటిలాగే తప్పించుకున్నాడు. 

కిల్లర్ లేడీస్.. హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని హీరోయిన్లు!

సల్మాన్ ఖాన్ రియల్ లైఫ్ లో అనేక ప్రేమ కథలు ఉన్నాయి. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, జరీన్ ఖాన్ ఇలా చాలా మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలతో సల్మాన్ ఖాన్ ప్రేమాయణం సాగించినట్లు రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రొమేనియా బ్యూటీ ఇలియా వంటూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 

చిరంజీవి, మహేష్, విజయశాంతి ఎఫెక్ట్.. పోలీసులు ఏం చేస్తున్నారంటే..