టాలీవుడ్ బుల్లితెర యాంకర్ ప్రదీప్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. నటుడిగా, యాంకర్ గా ప్రదీప్ టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ హీరోగా మారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. 

ప్రదీప్ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో మంచి బజ్ కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ప్రదీప్ కు ఊహించని షాక్ ఎదురైంది. ప్రదీప్ పై బంజారా హిల్స్ లో ఓ యువ నటుడు కేసు నమోదు చేశాడు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రదీప్ ఈ చిత్రంలో నటిస్తున్నాడని సదరు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ధనుష్ వల్లే అమలాపాల్ విడాకులు.. పెళ్లి తర్వాత జరిగింది ఇదే, సంచలన కామెంట్స్!

నిబంధనల ప్రకారం జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి సినిమాల్లో నటించడానికి వీల్లేదు. ప్రదీప్ పై గతంలో ఓ యువతిని వేధించిన కారణంగా రెండు రోజులు జైల్లో ఉంచారు. కానీ ప్రదీప్ మాత్రం ప్రస్తుతం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

హీరోలకే మైండ్ బ్లాక్.. మాస్ స్టెప్పులతో టాప్ లేపేసిన హీరోయిన్లు

యాంకర్ ప్రదీప్ తో పాటు ఈ చిత్ర దర్శకుడు కూడా నిబంధనల్ని అతిక్రమించారని, వారిపై చర్యలు తీసుకోవాలని సదరు యువకుడు పోలీసులని కోరాడు. ప్రస్తుతం పోలీసులు యువకుడి కేసుని పరిగణలోకి తీసుకున్నారు. విచారణ జరిపి, న్యాయ సలహాలు తీసుకున్న అనంతరమే కేసు నమోదు చేస్తామని అన్నారు.