సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. క్రేజీ బ్యూటీ రష్మిక మందన తొలిసారి మహేష్ తో ఈ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. అనిల్ రావిపూడి వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. 

ఈ చిత్రంలో అనిల్ రావిపూడి మహేష్ బాబుని ఆర్మీ మేజర్ గా చూపించబోతున్నాడు. ఈ చిత్రంలో కర్నూలు బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తుండడం ఉంటారో హైలైట్. ప్రతి ఒక్కరూ మహెష్, విజయశాంతి కలసి ఎలా నటించారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని భారీ అంచనాల నడుమ సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న రిలీజ్ కు రెడీ అవుతోంది. 

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తోంది. తాజాగా సరిలేరు చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. రిలీజ్ కు 9 రోజుల ముందే నిర్మాతలు ఏఈ చిత్రానికి సెన్సార్ కంప్లీట్ చేసేశారు. సెన్సార్ సభ్యులు మహేష్ చిత్రానికి 'యూఏ' సర్టిఫికేట్ జారీ చేశారు.  

చిరంజీవి, మహేష్ తో మొదలైన రచ్చ..'మా' పరువు తీసిన సంఘటనలు!

సెన్సార్ పూర్తయిన విషయాన్ని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు తన ట్రేడ్ మార్క్ రన్నింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. గతంలో మహేష్ బాబు ఈ తరహా రన్నింగ్ చాలా చిత్రాల్లో ఉంది. కానీ ఈ పోస్టర్ లో ఆర్మీ డ్రెస్ లో మహేష్ మరింత పవర్ ఫుల్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ఏడాది టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద పేలబోయే మొట్టమొదటి పెద్ద బాంబు సరిలేరు నీకెవ్వరు చిత్రమే. 

రాజశేఖర్ తో గొడవ.. మోహన్ బాబుని ముద్దాడిన చిరు!

దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సంగీత, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 

చిరు వెర్సస్ రాజశేఖర్ : గొడవల చరిత్ర ఇదీ!