చిరు వెర్సస్ రాజశేఖర్ : గొడవల చరిత్ర ఇదీ!

First Published 2, Jan 2020, 4:26 PM

మా అసోషషన్ వేదికగా మరోసారి చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. చిరంజీవితో గతంలో పలు సంధర్భాల్లో రాజశేఖర్ విభేదించారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ చిరంజీవిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పటికి చిరు, రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. 

రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ : మెగాస్టార్ చిరంజీవి అప్పటివరకు టాలీవుడ్ లో రారాజులా వెలుగొందారు. చిరు ప్రజారాజ్యం పార్టీ స్థాపించడానికి కొన్నేళ్ల ముందు నుంచే మెగాస్టార్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ అభిమానుల్లో ఉంది. శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత ఆ డిమాండ్ మరింతగా ఎక్కువైంది.

ప్రజారాజ్యం పార్టీ స్థాపన: రోజు రోజుకు డిమాండ్ ఎక్కువవుతుండడంతో చిరు ఎట్టకేలకు సన్నిహితులని, అభిమానులని సంప్రదించి సొంతంగా పార్టీ స్థాపించాలని నిర్ణయించుకున్నారు. అలా భారీ భహిరంగ సభతో ఆగష్టు 26, 2008న తిరుపతిలో చిరు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.

చిరంజీవిపై రాజశేఖర్ కామెంట్స్ : చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రకటించిన తర్వాత సహజంగానే రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. తోటి సినీ ప్రముఖులు మాత్రం చిరంజీవి నిర్ణయం పట్ల హుందాగా స్పందించారు. చిరు రాజకీయాల్లోకి రావాలని సన్నాహకాలు జరుగుతున్న కొన్ని నెలల ముందే రాజశేఖర్ వివాదానికి తెరతీశారు.

అనుభవం లేదు: 2008 జనవరిలో రాజశేఖర్ భీమవరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు సొంతంగా పార్టీ స్థాపిస్తే అందులో చేరుతారా అని ప్రశ్నించగా.. నేను చిరంజీవి పార్టీలో చేరను.. ఎందుకంటే ఆయనకు అనుభవం లేదు అని కామెంట్స్ చేశారు.

ట్రైన్ లో ఫ్యాన్స్ అటాక్ : రాజశేఖర్ వ్యాఖ్యలతో చిరు అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. రాజశేఖర్ ఫ్యామిలీ రైల్వే స్టేషన్ లో ఉండగా చిరు అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. రాజశేఖర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కారు ధ్వంసం : జనవరి 28న రాజశేఖర్ హైదరాబాద్ లో ఉదయం 5 గంటలకు కారులో ప్రయాణిస్తుండగా కొంతమంది చిరంజీవి అభిమానులు అటాక్ చేశారు. ఈ దాడిలో రాజశేఖర్ కారు ధ్వంసం అయింది.

చిరంజీవి బహిరంగ క్షమాపణలు :  ఈ సంఘటన జరిగిన అనంతరం అల్లు అరవింద్, చిరంజీవి ఇద్దరూ రాజశేఖర్ ఫ్యామిలీని కలిశారు. చిరంజీవి మీడియా ముఖంగా రాజశేఖర్ దంపతులకు క్షమాపణలు తెలిపారు. అంతటితో ఏ వివాదం అయితే సద్దుమణిగింది కానీ.. చిరంజీవిపై రాజశేఖర్ విమర్శలు మాత్రం ఆగలేదు.

అంతకుముందే మరో సంఘటన: చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలకు అసలు కారణం ఇది కాదు. రాజశేఖర్, చిరు మధ్య అంతకు ముందే ఓ సంఘటన జరిగిందట. ఈ విషయాన్ని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ విషయం గురించి రాజశేఖర్ చెప్పబోతుండగా జీవిత అడ్డుకున్నారు.

చిరు సపోర్ట్ : గత ఏడాది మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నరేష్ తరుపున ప్యానెల్ సభ్యులుగా జీవిత, రాజశేఖర్ పోటీ చేశారు. ఆ సమయంలో రాజశేఖర్, జీవిత, నరేష్ స్వయంగా చిరంజీవిని కలసి ఎన్నికల్లో తమకు సపోర్ట్ చేయాలని కోరారు.

మళ్ళీ మొదలైన కాంట్రవర్సీ : ఇదిలా ఉండగా నేడు మరోసారి చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు మా అసోసియేషన్ వేదికగా చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మాలో మొదలైన విభేదాలని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి అని చిరంజీవి సూచించారు. చిరంజీవి వ్యాఖ్యలని రాజశేఖర్ ఖండించారు. పలుమార్లు చిరంజీవి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మా డైరీ లాంచ్ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది.